Dec 05,2022 21:22

అర్జీదారునితో మాట్లాడుతున్న కలెక్టర్‌ బసంత్‌కుమార్‌

      పుట్టపర్తి అర్బన్‌ : స్పందన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులకు కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి 130 అర్జీలను స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ జిల్లాలోని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ స్పందనలో వచ్చిన ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని ఆదేశించారు. తిరిగి అర్జీలు రాకుండా చర్యలు తీసుకోవాలని పరిష్కరించిన వెంటనే ఫొటో తీసి నవశకం పోస్టులో అప్లోడ్‌ చేయాలన్నారు. దీనికి సంబంధించి అధికారులు కొందరు ఎన్నిసార్లు చెప్పిన తీరు మార్చుకోలేదని అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలైన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్‌ లు, ఈనెల ఆఖరుకు నిర్మాణాలు పూర్తి కావాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులకు కౌంటర్‌ ఫైల్‌ వేయాలని తహశీల్దారులను ఆదేశించారు. లోకాయుక్త కేసులను నిర్లక్ష్యం చేయరాదన్నారు. గహ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆశాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ భాగ్యరేఖ, డ్వామా పీడీ రామాంజనేయులు, డిఆర్‌డిఎ పీడీ నరసయ్య, సిపిఒ విజరు కుమార్‌, గహ నిర్మాణ శాఖ పీడీ నాగరాజు, పిఆర్‌ ఎస్‌ఇ గోపాల్‌ రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఇ రషీద్‌, స్పందన తహశీల్దార్‌ గోపాలకష్ణ పాల్గొన్నారు.