8 మాట్లాడుతున్న ఎస్‌పి
'స్పందన'లో 92 ఫిర్యాదులు స్వీకరణ
నెల్లూరు :జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 92ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎస్‌పి కె.తిరుమలేశ్వరరెడ్డి తెలిపారు. స్పందన కార్యక్రమంలో పాల్గొన్న ఎస్‌పి అధికారులనుద్ధేశించి మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు, బధిరుల సమస్యల పట్ల మానవతాదక్పథంతో సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనధికార చిట్స్ నిర్వాహకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నమ్మి మోసపోవద్దని సూచనలు చేశారు. మైనర్ బాలికల మిస్సింగ్ ఫిర్యాదులపై వెంటనే స్పందించి, బందాలతో చేధించి తల్లిదండ్రులకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. భార్యాభర్తల వివాదాలతో పరిష్కారం దిశగా సమర్ధవంతంగా కౌన్సిలింగ్ నిర్వహించాలని, కుటుంబాలు చక్కదిద్దబడతాయని నమ్మకం, భద్రత, భరోసా కలిగించాలని సూచించారు. ప్రభుత్వ, ఇతర ఉన్నత ఉద్యోగాలలో ఉన్నట్లు నమ్మించి పలు పెళ్ళిళ్ళు చేసుకొని మోసం చేసే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తగా నిర్ధారించుకోవాలని ప్రజలకు సూచనలు చేశారు. భర్తలను కోల్పోయి అత్తింటివారి వేధింపులకు గురవుతూ, పిల్లల పోషణకు ఇబ్బంది పడుతున్న, న్యాయపరమైన ఆస్థి విషయమై సాధ్యాసాధ్యాలను తెలియజేసి పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ యస్.పి.(అడ్మిన్), (క్రైమ్స్), ఏఆర్ డిఎస్‌పి, సెల్ -2 డిఎస్‌పి తదితరులు పాల్గొన్నారు.










