Apr 24,2023 19:51

ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరిస్తున్న కమిషనర్‌ఎస్‌. మనోహర్‌

ప్రజాశక్తి -కందుకూరు కందుకూరు పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 7 అర్జీలు వచ్చినట్లు మున్సిపల్‌ కమీషనర్‌ ఎస్‌. మనోహర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరూ సెక్షన్‌ హెడ్స్‌ పాల్గొన్నారు. ప్రతి సోమవారం కందుకూరు పురపాలకసంఘ కార్యాలయం కమీషనర్‌ ఛాంబర్‌లో జరుగు యువర్‌ కమిషనర్‌ కార్యక్రమంను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.