Aug 01,2022 23:09

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా)
సమాజంలో అనునిత్యం ఎదురవుతున్న సమస్య లను చూసి కంగిపోకుండా ఉండాలని, చట్ట పరిధిలో పూర్తిస్థాయి విచారణ చేసి పరిష్కారం చూపించడానికి కష్ణా జిల్లా పోలీస్‌ శాఖ ఎల్లవేళలా సిద్ధంగా ఉందని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పి. జాషువా స్పష్టం చేశారు.స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా ఎస్పీ ఫిర్యాదుదారుల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతి పోలీస్‌ అధికారి, సిబ్బంది కృషి చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.