May 05,2023 21:40

ఫొటో : స్పందన అర్జీపై విచారిస్తున్న డ్వామా ఎపిడి, అదనపు మైనార్టీ వెల్ఫేర్‌ అధికారిని ఎ.నిర్మల దేవి

స్పందన అర్జీపై విచారణ
ప్రజాశక్తి-ఉదయగిరి : జిల్లా కలెక్టర్‌ హరి నారాయన్‌ ఆదేశాలతో స్పందన అర్జీపై జిల్లా అసిస్టెంట్‌ డ్వామా ఎపిడి, అదనపు మైనార్టీ వెల్ఫేర్‌ అధికారిని ఎ.నిర్మల దేవి విచారణ చేపట్టారు. శుక్రవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో తహశీల్దార్‌ సానా శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఇరువు వర్గాలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదు దారులు నూతన కమిటీ ఏర్పాటు కోరగా వాటిపై చర్చి కమిటీ సభ్యుల నుండి అభ్యంతరాలు అడిగి తెలుసుకొన్నారు.
ఒక కుటుంబం లాంటి చర్చిలో ఇలాంటి విభేదాలను సామ్రాజ్యంగా పరిష్కరించుకోవాలని విభేదాలకు తావివ్వకూడదన్నారు. రెండు వారాలలో అభ్యంతరంపై సంబంధిత డాక్యుమెంట్లు వివరాలను తహశీల్దార్‌కు ఇవ్వాలన్నారు. అనంతరం నివేదికను తయారుచేసి జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకుపోతామని తెలిపారు. కార్యక్రమంలో క్రిస్టియన్‌ మైనార్టీ ఫీల్డ్‌ఆఫీసర్‌ ఖాదర్‌ వలీ, ఇరువర్గీయులు పాల్గొన్నారు.