9 మాట్లాడుతున్న కమిషనర్
''స్పందన'' అర్జీలకు నిబద్ధతో పరిష్కారాం
- కమిషనర్ వికాస్ మర్మత్, ఐ.ఏ.ఎస్
నెల్లూరు:ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జరుగుతున్న స్పందన కార్యక్రమంలో అందుకున్న విజ్ఞప్తులకు నిబద్ధతతో పరిష్కారాలు అందించాలని నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ సూచించారు. కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన స్పందన వేదికలో కమిషనర్ పాల్గొని ''డయల్ యువర్ కమిషనర్'' కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ ను నేరుగా మాట్లాడారు. వివిధ సమస్యలపై వచ్చిన 17 ఫిర్యాదులను కమిషనర్ సంబంధిత విభాగం అధికారులకు తెలియజేసి సూచించిన గడువులోపు నాణ్యమైన పరిష్కారం అందించాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ విభాగం - 8, హౌసింగ్ ఫర్ ఆల్ - 2, టౌన్ ప్లానింగ్ - 3,పబ్లిక్ హెల్త్ - 1,వెటర్నరీ అధికారి - 3 ఫిర్యాదులను కమిషనర్ స్వీకరించారు.అనంతరం ప్రజలనుంచి నేరుగా అర్జీలను కమిషనర్ స్వీకరించారు. అందుకున్న సమస్యలకు నిర్దిష్ట గడువులోపు పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు. సమస్యలకు పరిష్కారం అందించిన తర్వాత సంబంధిత ఫిర్యాదుదారునికి మెసేజ్ వచ్చేలా చూడాలని అధికారులకు సూచించారు. సమస్యలు పునరావతం కాకుండా శాశ్వత పరిష్కారం అందించాలని తెలిపారు.ఫిర్యాదులపై ప్రత్యక్షంగా ఫీల్డ్ విజిట్ చేస్తానని, సమస్యలు పరిష్కరించని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏ.పి సేవా పోర్టల్ లో ఉన్న సాంకేతిక సమస్యలను నేరుగా తనకు వివరిస్తే, ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్ళి పరిష్కారం అందించేందుకు కషి చేస్తానని కమిషనర్ వెల్లడించారు. స్పందన వేదికలో అందించే ఫిర్యాదుల సంఖ్యను తగ్గించేందుకు అధికారులంతా సమన్వయంతో పని చేయాలని సూచించారు. అన్ని విభాగాల ఉన్నతాధికారులు తమ విభాగాల పనితీరును మెరుగుపరిచేందుకు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలన్నారు. పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ ఉత్పత్తుల వాడకంపై ప్రజల్లో అవగాహన పెంచుతామని, ప్రభుత్వం నిషేధించిన ప్లాస్టిక్ ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామన్నారు. నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ, అమ్మకం, కొనుగోలు చేయడం చట్టరీత్యా నేరమని, ప్రత్యేక బందాలతో దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అన్ని డివిజనుల్లో జనావాసాల మధ్య సంచరిస్తున్న పందులు, ప్రమాదకరంగా మారిన వీధి కుక్కల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. వీధి దీపాలు అవసరమైన అన్ని ప్రాంతాల్లో సౌకర్యం కల్పించాలని, చెడిపోయిన దీపాల స్థానంలో నూతన దీపాలను ఏర్పాటు చేయాలన్నారు. స్పందన వేదికలో అందుకున్న అన్ని సమస్యలకు పారదర్శకమైన పరిష్కారాన్ని, సూచించిన గడువులోపు అందించేందుకు అన్ని విభాగాల అధికారులు కషి చేయాలని కమిషనర్ కోరారు.










