ఫొటో : భోజనప్యాకెట్లు అందజేస్తున్న రామాయపట్నం పోర్ట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి
స్పందన అర్జీదారులకు అన్నదానం
ప్రజాశక్తి-కావలి : ఆర్‌డిఒ కార్యాలయంలో జరిగే స్పందనకు వచ్చే అర్జీదారులకు భోజనం ఏర్పాట్లు అభినందనీయమని రామాయపట్నం పోర్ట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి పేర్కొన్నారు. సోమవారం రెడ్‌క్రాస్ సమకూర్చిన భోజన పోట్లాలను పద్మావతి స్పందన అర్జీదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్ కేంద్రంలో జరిగే స్పందనకు, దూరప్రాంతాల నుండి పెండింగ్ సమస్యల పరిష్కారానికి వచ్చే అర్జీదరుల ఆకలి తీర్చాలని ఆర్‌డిఒ శీనానాయక్‌కు ఆలోచన రావడం, దానిని రెడ్‌క్రాస్ వారు ఆచరణలో పెట్టడం ప్రశంసనీయమని తెలిపారు. దాత రొటేరియన్ తుమ్మలపల్లి గోపాలకృష్ణమూర్తిని ఆమె అభినందించారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సిబ్బంది, దళిత సంఘర్షణ సమితి అధ్యక్షులు మల్లి పాల్గొన్నారు.










