May 02,2023 21:12

రికార్డులను పరిశీలిస్తున్న అధికారిణి


రికార్డులను పరిశీలిస్తున్న అధికారిణి
సొసైటీ కార్యాలయంలో డీసీఓ తనిఖీ
కొడవలూరు :మండలంలోని యల్లాయపాలెం సహకార సంఘం కార్యాలయాన్ని జిల్లా సహకారాధికారిణి బీ.సుధాభారతి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల నిల్వలు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. అనంతరం స్థానిక సచివాలయాన్ని పరిశీలించి సచివాలయం ద్వారా అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీసీఓ మాట్లాడుతూ రైతులకు సహకార సంఘాలు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. సకాలంలో ఎరువులు అందించడంతోపాటు అవసరాలకు రుణ సదుపాయం కల్పించి ఆసరాగా నిలవాలని సూచించారు
. ఆమె వెంట ఎన్డీఎల్సీఓ ఎంవి.సుభాషిణి, కోవూరు సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.శివకుమార్‌, విజయ డెయిరీ డైరెక్టర్‌ ఇసనాక ఆర్‌ సునీల్‌ రెడ్డిలు ఉన్నారు.