అట్లూరు : వైసిపి దొంగల ఇసుక దాహంతో రాష్ట్రంలోని ప్రజలకు శాపంగా మారిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. యువగళం పేరుతో లోకేష్ చేపట్టిన పాదయాత్ర 122 రోజుకు చేరుకుంది. శనివారం కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని జంగాలపల్లె విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభమై అట్లూరు క్రాస్, రెడ్డిపల్లె, కొండూరు, బాలిరెడ్డిబావి, నదియాబాద్ విడిది కేంద్రం వరకూ పాదయాత్ర సాగింది. ఆయా ప్రాంతాల్లో స్థానికులు, రైతులు, ఎస్‌సి సామాజిక వర్గీయులతో ముఖాముఖి, మాటామంతి, సమావేశాలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. పాదయాత్ర సందర్భంగా పలు చోట్ల లోకేష్ మాట్లాడుతూ రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి సిద్దవటం మండలం జంగాలపల్లె వద్ద పెన్నానదిని తోడేస్తున్నారని విమర్శించారు. అనధికారికంగా పోగేసిన ఇసుక డంపింగ్ యార్డును పెన్నానది పక్కనే ఉన్నా స్థాని కులకు మాత్రం ఇసుక అందుబాటులో ఉండటం లేదని వాపోయారు. బెంగుళూరు, హైదరాబాద్ నగరాలకు ఇక్కడ నుంచి ఇసుక తరలించి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నా ఎస్‌ఇబి అధికారులకు కనపడదా అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి పాపాలపుట్ట మాదిరి పెరిగిపోతున్న ఈ ఇసుక మేట రాష్ట్రంలో పేట్రేగిపోతున్న ఇసుక మాఫియాకు ప్రత్యక్షసాక్షి అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజల కష్టాలు పట్టడం లేదని అన్నారు. కొత్తగా ప్రాజెక్టులు కట్టడం చేతగాని జగన్ నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం దారుణమని పేర్కొన్నారు. చింటువారిపల్లి సోమశిల ప్రాజెక్టు భూ నిర్వాసితులకు తక్షణమే పరిహారం అంద జేయాల్సిందిగా ప్రభుత్వానికి లేఖరాస్తామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం నిర్వాసితులకు న్యాయం చేస్తుందని చెప్పారు. జగన్ ప్రభుత్వం రాయలసీమ రైతాంగానికి శాపంగా తయారె ౖందన్నారు. గతంలో 90 సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందజేయగా, ఈ ప్రాంత రైతాంగానికి ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. చీనీ రైతుల గిట్టుబాటు ధర కోసం గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారని, రాయలసీమ రైతుల కష్టాలు చూశాకే సీమను హార్టికల్చర్ హాబ్‌గా తీర్చి దిద్దాలని మిషన్ రాయలసీమలో ప్రకటించామని పేర్కొన్నారు. గత టిడిపి ప్రభుత్వం రాయ లసీమలో ప్రాజెక్టుల కోసం రూ. 11,700 కోట్లు ఖర్చుచేస్తే, వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగోవంతు కూడా ఖర్చుచేయలేదని విమ ర్శించారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డ్రిప్ సబ్సిడీని పునరుద్దరిస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో హార్టికల్చర్‌కు అందజేసిన రాయితీలన్నీ తిరగి ప్రవేశపెడతామని తెలిపారు. చీనీ రైతులకు కోల్డ్ స్టోరేజిలు, మెరుగైన మార్కె టింగ్ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రెడ్డిపల్లి, కొండూరు, అట్లూరు గ్రామాల ప్రజలకు చెక్ పోస్టు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మిషన్ రాయలసీమ కార్యక్రమంలో రైతుల సమస్యలు పరిష్కారం చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టు కున్నామని తెలిపారు. జ్యూస్ ఫ్యాక్టరీలు ఏర్పాటుకు కావాల్సిన చీనీ రకాలు పెంచేలా ప్రోత్సVి ాస్తామన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టుబడి తగ్గేలా ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు అన్ని తక్కువ రేటు కి అంద జేస్తామని పేర్కొన్నారు. గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పారు. గతంలో ఇచ్చినట్టే డ్రిప్ సబ్సిడీలో అందజేస్తామన్నారు. కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. చీనీ రైతుల సమస్యల పరిష్కా రానికి కృషి చేస్తానని రైతులకు భరోసా ఇచ్చారు. మరో ఏడాది ఓపిక పట్టండి టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చీనీ రైతుల్ని ఆదుకుంటామన్నారు. రైతుల్ని ఆదుకోవడానికి తన వద్ద కొన్ని ఆలోచనలు ఉన్నాయని తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అమలు చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ఖర్చుచేయాల్సిన 28,147 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఎస్‌సి, ఎస్‌టి, బిసి కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు 27 సంక్షేమ పథకాలు రద్దు చేసి అన్యాయం చేశారని తెలిపారు. దళితుల నుండి 12 వేల ఎకరాల అసైన్డ్ భూములను లాక్కు న్నారని విమర్శించారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో అంబేద్కర్ విదేశీవిద్య ద్వారా దళిత విద్యార్థులను విదేశాలకు పంపి చదివించామని తెలిపారు. అధికాంలోకి వచ్చిన తరువాత గతంలో అమలు చేసిన సంక్షేమ పద ¸కాలు కొనసా గిస్తామన్నారు. గిరిజనులు స్వేచ్చగా అడవుల్లోకి వెళ్లి వెదురు తెచ్చుకునే హక్కు కల్పి స్తామన్నారు. ఎస్‌సి కార్పొరేషన్ ద్వారా గిరిజనులకు సబ్సిడీ రుణాలు అందజేస్తాం, గిరిజనులకు పోడు భూములు అప్పగిస్తామన్నారు. కార్యక్రమంలో టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్. శ్రీనివాసరెడ్డి, బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, రితీష్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి కఁమార్తె కైవల్యా రెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు.










