Feb 02,2023 18:47

శనగ పంటను పరిశీలిస్తున్న ఎఒ

 ప్రజాశక్తి-వలేటివారిపాలెం : మండలంలోని నేకునాంపురం, శింగమనేనిపల్లె గ్రామాల్లో సాగవుతున్న శనగ పంట పొలాలను మండల వ్యవసాయాధికారి bం హేమంత్‌ భరత్‌ కుమార్‌ రైతులతో కలిసి గురువారం పరిశీలించారు. శనగలో bండు తెగులు ఉందని, నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. రబీ సీజన్‌లో సాగు చేసిన శనగ, పొగాకు, పత్తి పంటలను రైతులు సచివాలయాల పరిధిలోని రైతుభరోసా కేంద్రాల నందు వ్యవసాయ, ఉద్యాన సహాయకుల ద్వారా ఈ-పంట నమోదు చేయించుకోవాలని సూచించారు. వ్యవసాయ సహాయకులు వై ప్రభు, రైతులు పాల్గొన్నారు.