'సంయుక్త' ఆధ్వర్యంలో వైద్య శిబిరం
ప్రజాశక్తి-కావలి : సంయుక్త సేవాసంస్థ ఆధ్వర్యంలో ఆదివారం జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం నెల్లూరు, కావలి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహకారంతో జి.వంశీ, బి.శ్రీనాద్, ఎన్.శ్రీరాం బ్రహ్మం, జె.గంగాధర్, బి.భాగ్యరాజ్, జి.అనీల్ కుమార్, ఎన్.నరేష్, జి.సుజన్, టి.శివ కుమార్, ఎం.క్రిష్ణ కిశోర్ దాతృత్వంతో తుఫాన్ నగర్లోని శ్రీ పొట్టి శ్రీరాములు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మూడో వైద్యశిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా బామా సుధాకర్‌రెడ్డి దాత భాగ్యరాజు పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ వైద్య శిబిరానికి బామా సుధాకర్‌రెడ్డి సంస్థకు రూ.12వేల ఆర్థికసాయం అందజేశారు. ఈ వైద్యశిబిరంలో డాక్టర్ బెజవాడ రవికుమార్, డాక్టర్ సుధీర్‌కుమార్, డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ ఉమాచంద్, డాక్టర్ కర్నాటి.రోహిత్, డాక్టర్ నక్కా.రేవంత్ పాల్గొని పేదలకు వైద్య సేవలు అందించారు. ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న పేదలకు సంస్థ ద్వారా ఉచితంగా సుగర్ పరీక్షలు, రవి నర్సింగ్ హోమ్ వారి సహకారంతో బిసి, రక్త శాతం, బ్లెడ్ గ్రూపుల పరీక్షలు ఉచితంగా చేశారు. ఈ సందర్భంగా డాక్టర్.రవికుమార్, డాక్టర్ కర్నాటి.రోహిత్ మాట్లాడుతూ సంయుక్త సేవాసంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడో వైద్య శిబిరంలో పాల్గొన్న పేదలకు సుగర్ వ్యాధి, గుండె వ్యాధులపై ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించారు. సంయుక్త సేవాసంస్థ ద్వారా నిర్వహిస్తున్న అనేక సేవలో భాగంగా ఈ వైద్య శిబిరం పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు. ప్రతిరెండు నెలలకు ఒకసారి నాల్గవ ఆదివారం జరిగే ఈ వైద్య శిబిరంలో పేద ప్రజలు పాల్గొని వైద్యసేవలు తీసుకోవాలని తెలియజేశారు. తదుపరి వైద్య శిబిరం మే 28వ తేదీన ఇదే పాఠశాలలో జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి సహాయం అందజేస్తున్న దాత భాగ్యరాజుకి, వైద్య శిబిరం కోసం ఆర్థికసాయం అందజేసిన బామా.సుధాకర్‌రెడ్డికి, వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ కర్నాటి.రోహిత్, డాక్టర్ నక్కా.రేవంత్‌లకు సంయుక్త సేవాసంస్థ చిరు సత్కారం చేశారు. కార్యక్రమంలో నెల్లూరు జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం నుంచి కామయ్య, క్రిష్ణా రావు, ఈ కార్యక్రమ దాత భాగ్యరాజు, సంయుక్త సేవా సంస్థ అధ్యక్షుడు సురేంద్ర, సంయుక్త సేవాసంస్థ వైద్య శిబిరం కమిటీ సభ్యులు సభ్యులు ఎం.అజిత్ బాబు, ఎం.చంద్ర శేఖర్, ఎం వి ఎన్.ప్రసాద్‌రావు, పి.వి.సాయి తేజ, జన విజ్ఞాన వేదిక సభ్యులు షేక్.ఖాధర్ బాషా, శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు, పాఠశాల ఎన్‌సిసి విద్యార్థులు పాల్గొని వాలంటీర్స్‌గా సేవలందించారు.










