Jan 26,2023 21:56

మాట్లాడుతున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

ప్రజాశక్తి - నెల్లూరు ప్రతినిధి :సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీఠ వేసిందని, అర్హులకు ప్రభుత్వ ఫలాలు అందిస్తున్నామని కలెక్టర్‌ చక్రధర్‌బాబు అన్నారు. 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గురువారం స్థానిక పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో కలెక్టర్‌ జాతీయ పతాకావిష్కరణ ఆవిష్కరించారు. , పోలీసు, ఎన్‌.సి.సి. దళాలచే గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌ బాబు మాట్లాడుతూ ప్రజలందరికీ 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్య్రం కోసం ఎనలేని త్యాగాలు చేసిన స్వాతంత్య్ర సమర యోధులకు మరియు భారత రాజ్యాంగ నిర్మాతలకు జోహార్లని, 1950వ సంవత్సరం జనవరి 26 మన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడిన రోజు అన్నారు. అహింసయే ఆయుధంగా జాతిపిత మహాత్మాగాంధీ, జవహర్‌ లాల్‌ నెహ్రూ, సర్ధార్‌ వల్లభారు పటేల్‌, సుభాష్‌ చంద్రబోస్‌, టంగుటూరి ప్రకాశం పంతులు, అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు లాంటి ఎందరో మహానుభావుల పోరాట ఫలితంగా 1947 ఆగష్టు 15వ తేదిన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ గారిచే రూపొందించబడిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చిందన్నారు. ఆనాటి నుండి భారత దేశము ''సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా'' అవతరించిందన్నారు. అప్పటి నుంచి ప్రతి ''గణతంత్ర దినోత్సవం'' ను జరుపుకొనుచున్నామన్నారు. . పారదర్శకతతో కూడిన సుపరిపాలనలో భాగంగా శాస్త్ర సాంకేతిక సహాయంతో నూతన విధానాలను అనుసరిస్తూ గ్రామాల సర్వతో ముఖాభివద్దికి, సంక్షేమానికి పెద్ద పీట వేసి,జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అమలు చేయుచున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలిపి, సంక్షేమ ఫలాలను అర్హులందరికీ వారి వారి ఇంటి వద్దకే అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్‌ నిర్మాణంలో భాగంగా నూతన జిల్లాల, రెవెన్యూ డివిజన్ల పునఃవ్యవస్థీకరణ చేపట్టి అభివద్ది ప్రధంలో ఉన్నత లక్ష్యాలను సాధించడానికి ప్రవేశపెట్టిన నవరత్నాలు వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ, 15 రకాల పింఛన్లు, పేదలందరికి ఇళ్లు వంటి ఎన్నో పధకాలను ప్రతిష్టాత్మకంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా అమలుపరుచుట జరుగుచున్నదని తెలిపారు. జిల్లాలో వివిధ శాఖల ద్వారా సాధించిన వివిధ సంక్షేమ అభివద్ధి కార్యక్రమాల ప్రగతి మరియు రాబోవు సంవత్సరాల కాలంలో చేపట్టే కార్యక్రమాలను జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌ బాబు వివరించారు.

అలరించిన సాంస్కతిక కార్యక్రమాలు
గణతంత్రదినోత్సవం సందర్బముంగా పోలీసు పెరెడ్‌ గ్రౌండ్‌లో వివిధ పాఠశల విద్యార్దులచే నిర్వహించిన సాంస్కతిక కార్యక్రమాలు అలరించాయి. నెల్లూరులోని శ్రీ చైతన్య ఇంగ్లీష్‌ మీడియం హై స్కూల్‌, సిల్వర్‌ ఒకస్‌ ఇంగ్లీష్‌ మీడియం హై స్కూల్‌, రత్నం ఇంగ్లీష్‌ మీడియం హై స్కూల్‌ విద్యార్థులు, చెముడుగుంటలోని జిల్లా ప్రజా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఇందుకూరుపేటలోని ఏపీ ట్రైబల్‌ వెల్ఫేర్‌ బాలుర రెసిడెన్షియల్‌ స్కూల్‌ విద్యార్థులు, గొలగమూడిలోని ప్రభుత్వ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆశ్రమ హై స్కూల్‌ విద్యార్థులు, ముత్తుకూరులోని ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌ బాలికల జూనియర్‌ కళాశాల విద్యార్ధులచే దేశభక్తి ఉట్టిపడేలా ప్రదర్శించబడిన సాంస్కతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ సంధర్భంగా సంస్కతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్ధులకు జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌ బాబు మెమోంటోలను అందచేశారు.
ఆకట్టుకున్న ప్రభుత్వ శకటాలు
గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అటవీ శాఖ, గహ నిర్మాణ శాఖ, వైద్య మరియు ఆరోగ్య శాఖ, మైక్రో ఇరిగేషన్‌, పంచాయతీ రాజ్‌, జిల్లా గ్రామీణాబివద్ది సంస్థ, సమగ్ర శిక్ష, ఐటిడీఏ, స్రీ శిశు సంక్షేమ శాఖ మరియు అగ్నిమాపక శాఖలకు సంబంధించి, ఆయా శాఖలు అమలు చేస్తున్న సంక్షేమ మరియు అభివద్ది కార్యక్రమాలపై నిర్వహించిన శకటాల ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకున్నాయి. వేడుకలకు విచ్చేసిన ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్దులు శకటాల ప్రదర్శనను ఎంతో ఆసక్తిగా తిలకించారు. ప్రమాదం సంభవించినప్పుడు అగ్నిమాపక సిబ్బంది ఏ విధంగా విధులు నిర్వహించడనో ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకున్నది. శకటాల ప్రదర్శనకుగాను సంయుక్తంగా జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థ, అగ్నిమాపక శాఖల శకటాలకు మొదటి బహుమతి, ఐటిడిఏ, పంచాయతీ రాజ్‌ శాఖ శకటాలకు సంయుక్తంగా రెండవ బహుమతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, అటవీ శాఖల శకటాలకు సంయుక్తంగా తతీయ బహుమతి లభించగా, సంబందిత శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌ బాబు మెమోంటోలను అందచేశారు.
ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు
జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేసి తమ విధుల పట్ల ఉత్తమ సేవలందించిన 705 మంది ఉద్యోగస్తులకు జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌ బాబు, ప్రశంసా పత్రాలను అందచేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ ఆనం అరుణమ్మ, శాసన మండలి సభ్యులు వాకాటి నారాయణరెడ్డి, బల్లి కల్యాణ్‌ చక్రవర్తి, జిల్లా జడ్జి యామిని, ఎస్‌.పి. విజయ రావు, జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌. కూర్మనాథ్‌, కందుకూరు సబ్‌ కలెక్టర్‌ ఎస్‌.ఎస్‌. శోభిక, విక్రమ సింహపురి విశ్వ విద్యాలయం ఉప కులపతి ఆచార్య సుందరవల్లి, అడిషనల్‌ ఎస్‌.పి.లు హిమవతి, ప్రసాద్‌, సెబ్‌ జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీలక్ష్మి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, డీసీఎంఎస్‌ చైర్మన్‌ వీరిచలపతి, విజయ డైరీ ఛైర్మన్‌ రంగా రెడ్డి, జంగం కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వాగులేటి ప్రసన్న, జిల్లా అధికారులు, స్వాతంత్య్ర సమరయోధులు, వివిధ పాఠశాలల విద్యార్ధిని విద్యార్ధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.