ప్రజాశక్తి - పొదలకూరు :సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల వల్ల పేదలకు ఎంతో మేలు జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక డిఎన్‌ఆర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం డాక్టర్‌వైఎస్‌ఆర్ చిరునవ్వు పథకంలో భాగంగా కోల్గోట్ - పామోలివ్ అసోసియేషన్ సోమవారం చేపట్టిన బ్రైట్ స్మైల్.. బ్రైట్ ఫ్యూచర్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. తొలుత ఆయన జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం దంత అవగాహనకు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. దంతాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు డాక్టర్ వైఎస్‌ఆర్ చిరునవ్వు పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభిం చారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని తొలుతు సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భగా ఆయన కోల్గేట్ కంపెనీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.కోల్గేట్ కంపెనీ ఎండి ప్రభా నరసింహన్, రాష్ట్ర ఆరోగ్య ప్రత్యేక కార్యదర్శి నవీన్ కుమార్, ఏపీ డెంటల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ పూనం శర్మ, ఏపీ డెంటల్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి,పొదలకూరు సర్పంచ్ మల్లిక చిట్టెమ్మ, ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసులు రెడ్డి, ఎంపీటీసీలు గుంటి శ్రీనివాసులు, బాలుర ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ సనత్ కుమార్, మండల వైకాపా నాయకులు గొగిరెడ్డి గోపాల్ రెడ్డి, వేణుంబాక చంద్రశేఖర్ రెడ్డి, బచ్చల సురేష్ కుమార్ రెడ్డి, మూలి సతీష్ కుమార్ రెడ్డి, సోమా భాస్కర్ పాల్గొన్నారు.










