కదిరి టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పివి. సిద్ధారెడ్డి సూచించారు. పట్టణంలోని దత్త గార్డెన్స్, కుమ్మరవాండ్లపల్లి దారుల్ సలాం ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో వైసిపి గృహ సారధులకు శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం మం నిర్వహించారు. రూరల్ మండలానికి చెందిన గృహ సారథులకు, సచివాలయ కన్వీనర్లకు, వాలంటీర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈనెల 11వ తేదీ నుండి జెసిఎస్ మండల ఇన్‌ఛార్జితో సచివాలయ కన్వీనర్లు సమన్వయంతో వాలెంటీర్ పరిధిలో గల ఇద్దరు గృహ సారథులు వాలంటీర్ తో కలిసి జగనన్న చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఏ విధంగా చేరువయ్యాయో తెలుసుకోవాలన్నారు. లబ్ధిదారులు జగనన్న చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు సంతప్తి చెందినట్లయితే ఒక వీడియోను మండల జెసిఎస్ గ్రూప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. అర్హత కలిగిన ఎవరికైనా సంక్షేమ పథకాలు అందని పక్షంలో ఆ వివరాలను కనుక్కొని ఆ పథకాలు ఎందుకు వర్తించలేదో వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రాధాబాయి, ఎంపీపీ అమర్నాథ్ రెడ్డి, జెస ఎస్ మండల ఇన్‌ఛార్జులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










