ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లాలని, తిరిగి జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే మేడా వెంకట మల్లిఖార్జునరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్‌నాధ్‌రెడ్డి అన్నారు. మునక్కాయలపల్లి సమీపంలోని ఓ కల్యాణమండపంలో గురువారం ఎంపిటిసిలు, సర్పంచులు, సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అనంతరం గృహసారథులకు కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు ఆకేపాటి మురళిరెడ్డి, నాయకులు యోగేశ్వర్‌రెడ్డి, కొండూరు శరత్‌కుమార్‌రాజు, ఊటుకూరు ఎంపిటిసి నాగ చంద్రశేఖర్‌రెడ్డి, సర్పంచ్ ఈశ్వరయ్య, పృథ్వీపతిరెడ్డి, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.










