ప్రజాశక్తి - మంత్రాలయం
సంక్షేమ పథకాల బుక్ లెట్‌తో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహిస్తున్నట్లు వైసిపి రాష్ట్ర యువజన విభాగం నాయకులు వై.ప్రదీప్ రెడ్డి తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు వైసిపి మండల అధ్యక్షులు భీమిరెడ్డి, ఇన్‌ఛార్జీ విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని సూగూరు గ్రామంలో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినేనని తెలిపారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాల బుక్ లెట్‌ను అందజేసి పథకాల వివరాలను వివరిస్తూ ముందుకు సాగారు. గడపగడపకు తిరుగుతున్న సమయంలో వృద్ధులు, వికలాంగులను ఆప్యాయంగా పలుకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు వైసిపి నాయకులకు పలువురు నాయకులు శాలువా, పూలమాలలు వేసి సన్మానించారు. ఎస్‌ఐ వేణు గోపాల్ రాజ్ పాల్గొన్నారు.