Jan 11,2023 21:05

ఫొటో : చుంచులూరులో ప్రారంభమైన క్రీడా పోటీలు

సంక్రాంతి క్రీడా పోటీలు ప్రారంభం
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని చుంచులూరు మాజీ సర్పంచ్‌ ముద్దులూరు వెంకటరాజు స్మారక సంక్రాంతి క్రీడా పోటీలను ప్రముఖ రాజకీయ నాయకులు ఎన్‌.వి సుబ్బరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన పల్లె పండగ సంక్రాంతిని సంతోషకరమైన వాతావరణంలో జరుపుకోవడంలో భాగంగా ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని, క్రీడలు మానసిక శారీరక వికాసానికి ఎంతగానో దోహదం చేస్తాయని, క్రీడలతో మానవ సంబంధాలు మెరుగవుతాయన్నారు. ఈ క్రీడా పోటీలలో క్రికెట్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించనున్నారు. మొదటగా క్రికెట్‌ టోర్నమెంట్‌తో ఈ పోటీలను ప్రారంభించారు.
క్రికెట్‌ పోటీలో 30 జట్లు తలపడనున్నాయి. బుధవారం జరిగిన పోటీలలో ఇర్లపాడు, కదిరినాయుడు పల్లి, ఎగువపల్లి, రాజుపాలెం బి, చుంచులూరు సి, జట్లు విజయం సాధించాయి. అనంతరం చుంచులూరు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నైతిక విలువలు అనే అంశంపై వ్యాసరచన పోటీ, రంగవల్లుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో చుంచులూరు సర్పంచ్‌ చీలపోగు చామంచయ్య, మాజీ సర్పంచులు దువ్వూరు జయదేవ్‌, యలగాల వెంకటేశ్వర్లు, విశ్రాంత మండల విద్యాశాఖ అధికారి జొన్నా సత్యనారాయణ, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు కలిశెట్టి వెంకట రమణయ్య, విశ్రాంత హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ చీర్ల రామకృష్ణారెడ్డి, మోహన్‌ రాజు, నాగరాజు, బత్తలపల్లి రోశరెడ్డి, కోట విజయభాస్కర్‌ రెడ్డి, ఇందూరు విష్ణుకుమార్‌రెడ్డి, కలిశెట్టి రాజేంద్రకుమార్‌, కర్యావుల రమణయ్య, దయాకర్‌రెడ్డి, యల్లంరాజు కృష్ణంరాజు, చుంచులూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్‌, సురభిబోయిన శేషయ్య, ఈదల కొండయ్య, మహమ్మద్‌ రఫీ, బాసిరెడ్డి శివ, సుమన్‌, వనం నరసింహులు, కూరాకు కృష్ణయ్య, తంగేడుపల్లి శ్రీను, సుబ్బయ్య, బోటిక శ్రీనివాసులు, వెంకటేశ్వర ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.