ప్రజాశక్తి - రాయచోటి టౌన్ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర వారి బోధనలు ఆధారంగా రూపొందించిన 'సంఘం శరణం గచ్ఛామి' పోస్టర్‌ను కెవిపిఎస్ జిల్లా కన్వీనర్ పెంచలయ్య, కో - కన్వీనర్ డి.సి. వెంకటయ్య శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి ఈనెల 25వన గఫార్ ఫంక్షన్ హాల్‌లో సంఘం శరణం గచ్ఛామి నత్య రూపకం నిర్వహిస్తున్నామని సామాజిక సంఘాలు, ఉద్యోగులు, విద్యార్థులు మేధావులు, అభ్యుదయవాదులు, స్థానిక ప్రజానికం అందరూ హాజరై తిలకించాలని పేర్కొన్నారు. రాజ్యాంగం కుల, మత విభేదాలతో సంబంధం లేకుండా లౌకిక విధానాన్ని రాజ్యాంగం ప్రసాదించిందని రాజ్యాంగ స్ఫూర్తికి నేడు తూట్లు పొడుస్తున్నారని వాపోయారు. ప్రతి ఒక్కరూ వీక్షించి ప్రదర్శనను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు ఎం. మణి పాల్గొన్నారు.










