ప్రజాశక్తి-నెల్లూరు : సమాజాన్ని చైతన్యపరిచిన యోగివేమన గొప్ప దార్శనికులు, సంఘ సంస్కర్త అని కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. గురువారం నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జిల్లా పర్యాటక సాంస్కతిక శాఖ ఆధ్వర్యంలో యోగి వేమన జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిలుగా హాజరైన కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు ,సంయుక్త కలెక్టర్ రోనంకి కూర్మనాథ్‌తో కలిసి యోగి వేమన చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన గావించారు.కలెక్టర్ మాట్లాడుతూ యోగివేమన గొప్ప మహనీయులని, వారిని స్మరించుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందన్నారు. వారు తెలుగు జాతికి, తెలుగు భాషకు చేసిన ఎనలేని సేవలు స్మరించుకోవడం మన కర్తవ్యమన్నారు. జిల్లా పర్యాటక సాంస్కతిక అధికారి కనకదుర్గ భవాని డీఈవో వి ఎస్ సుబ్బారావు ఆర్ ఐ ఓ ప్రసాదరావు సర్వ శిక్ష ఏపీసి ఉషారాణి, జిల్లా రచయిత సంఘం అధ్యక్షులు జయప్రకాష్ పలువురు కవులు పాల్గొన్నారు.
రాపూరు : రాపూరు లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో గురువారం వేమన జయంతి ఘనంగా నిర్వహించారు. వేమన చిత్రపటానికి మండల పరిషత్ అభివద్ధి అధికారి కె.ఆమోస్ బాబు , కార్యాలయ సిబ్బంది ఎంపీటీసీ సభ్యులు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.మండల అధికారులు పాల్గొన్నారు.










