Mar 15,2023 21:51

ఫొటో : యాత్రను ప్రారంభిస్తున్న నాయకులు

సంగ్రామయాత్ర ప్రారంభం
ప్రజాశక్తి-మర్రిపాడు : ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణ లక్ష్య సాధనలో భాగంగా మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు బుధవారం ఎంఆర్‌పిఎస్‌ జెండాను ఎంఎస్‌పి సీనియర్‌ నాయకులు వెంకటేశ్వర్లు మాదిగ ఆవిష్కరించారు. అనంతరం మండల కేంద్రం నుండి రెండో విడత మాదిగల సంగ్రామ పాదయాత్రను ఎంఎస్‌పి జిల్లా కన్వీనర్‌ పందిటి అంబేద్కర్‌ మాదిగ ఎంఆర్‌పిఎస్‌ సీనియర్‌ నాయకులు నందిపోగు వెంగళరావు మాదిగ ప్రారంభించిన పాదయాత్రను ఎంఎస్‌పి జిల్లా ఇన్‌ఛార్జి గొల్లపల్లి శ్రీనివాస్‌ మాదిగ జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్‌సి వర్గీకరణపై బిజెపి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ ప్రతి గ్రామంలో మాదిగలను చైతన్య పరుస్తూ ఏప్రిల్‌ 3న జరుగు బిజెపి జిల్లా కార్యాలయం ముట్టడిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టో ద్వారా మాదిగలకు హామీనిచ్చిన బిజెపి నేటికి 9 సంవత్సరాలు గడిచిన నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని, ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని, లేనిపక్షంలో మార్చి 27, 28 తేదీల్లో మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద జరిగే మహా ధర్నాకు జిల్లాల నుంచి మాదిగలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ ఎంఎస్‌పి ఇన్‌ఛార్జి బొద్దుకూరు మహేష్‌ మాదిగ, ఎంఎస్‌పి సీనియర్‌ నాయకులు సోంపల్లి హజరత్‌ మాదిగ, జిల్లా సీనియర్‌ నాయకులు రమణయ్య మాదిగ, మహిళా నాయకురాలు ఆదిలక్ష్మి మాదిగ, ఎంఎస్‌పి నాయకులు మురళీ మాదిగ, రామయ్య మాదిగ, నరసయ్య మాదిగ, తిరుపతి మాదిగ, బుర్ర వెంగయ్య మాదిగ, తదితరులు పాల్గొన్నారు.