నినాదాలు చేస్తున్న అంగన్‌వాడీలు
సమస్యలు పరిష్కరించాలని
పలుచోట్ల అంగన్‌వాడీల ధర్నా
బుచ్చిరెడ్డిపాళెం:దీర్ఘకాలంగా కాలకంగా పెండింగ్‌లోని తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు బుధవారం సిడిపిఒ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు కార్యదర్శి ఎల్‌వి శేషమ్మ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పలుమార్లు తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి, అధికారులకు విన్నవిం చుకున్న అవి అలాగే ఉన్నాయన్నారు. సుప్రీంకోర్టు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని ప్రభుత్వానికి తెలియజేసిన తమకు ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం వెంటనే ఫేస్ యాప్‌ను రద్దు చేయాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ నాటికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని, ఆఖరి వేతనాన్ని పింఛన్ ఇవ్వాలని కోరారు. నాణ్యమైన సరుకులను అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేయాలన్నారు. కేంద్రాలపై రాజకీయ, ప్రభుత్వ అధికారుల జోక్యాన్ని తగ్గించాలన్నారు. తమ న్యాయమైన కోర్కెలు పరిష్కరించుకుంటే ఫిబ్రవరి 6న జిల్లా కేంద్రంలో అన్ని అంగన్‌వాడీ కేంద్రాలను మూసి ఆయాలు, వర్కర్లు ధర్నా చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రాజేశ్వరి, కవిత, విజయభారతి, వజ్రమ్మ, సుభాషిణి, ప్రసన్న, శైలజ, వెంకట రమణమ్మ, పద్మలత పాల్గొన్నారు.
కోవూరు
అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని.సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ ఇవ్వాలని. పేస్ యాప్ రద్దు చేయాలని.. డిమాండ్ చేస్తూ.. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు బుధవారం కోవూరు ప్రాజెక్టు కార్యాలయం వద్ద భారీ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు సుజాతమ్మ మాట్లాడుతూ.అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని, వారికి కనీస వేతనం 26వేలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించనప్పుడు వారికి ఫేసు యాప్ పెట్టడం దారుణమన్నారు వెంటనే పేస్ యాప్‌ను రద్దు చేయాలని కోరారు.కార్యక్రమంలో కోవూరు ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ వర్కర్లు, అండ్ హెల్పర్స్ పాల్గొన్నారు.










