వినతి పత్రాన్ని ఇస్తున్న వివోఏలు
ప్రజాశక్తి-అరకులోయ రూరల్:వివోఎలకు జారీ చేసిన కాల పరిమితి సర్కులర్ రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని శనివారం అరకువేలి వెలుగు కార్యాలయంలో ఏపీఎం అప్పయమ్మకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి జె.భగత్‌రామ్ మాట్లాడుతూ, జారీ చేసిన కాల పరిమితి సర్కులర్ రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలన్నారు. రూ.10 లక్షల సాధారణ, ఆరోగ్య భీమా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మార్చి నెల బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివోఏ సభ్యులు రాజ్ కుమార్, మధు, ఆనంద్, రత్నమని, జమున, సభ్యులు పాల్గొన్నారు.










