Dec 20,2022 09:29

గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ లోగో విడుదల చేస్తున్న కలెక్టర్‌ బసంత్‌కుమర్‌

           పుట్టపర్తి అర్బన్‌ : గడపగడపకు కార్యక్రమంలో వచ్చిన సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్‌ బసంత్‌కుమర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి సమస్యలపై ప్రజల ఇచ్చిన 128 అర్జీలను ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ భాగ్యరేఖతో కలిసి స్వీకరించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాలోని మండలాల అధికారులతో మాట్లాడారు. స్పందనలో వచ్చిన అర్జీలను అలసత్వం లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలైన వాహన మిత్ర, నేతన్న నేస్తం, జగనన్న విద్యాదీవెన తదితర పథకాలకు సంబంధించి త్వరగతిన చర్యలు చేపట్టాలన్నారు. వీటిపై మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు ప్రత్యేక దష్టి సారించాలన్నారు. గడపగడపకూ కార్యక్రమానికి చెందిన 163 పనులు ఇంకా గ్రౌండ్‌ కాలేదని వచ్చే గురువారం నాటికి పెండింగ్‌ పనులు పూర్తి చేయాలన్నారు. గహ నిర్మాణంలో ఈనెల ఆఖరుకు మంజూరైన ప్రతి ఒక్క ఇల్లూ గ్రౌండింగ్‌ కావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిపిఒ విజరు కుమార్‌, పంచాయతీరాజ్‌ ఎస్‌ఇ గోపాల్‌ రెడ్డి, హౌసింగ్‌ పీడీ చంద్రమౌళి రెడ్డి, భూగర్భ గనుల శాఖ అధికారి కష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ లోగో విడుదల
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించాలన్న లక్ష్యంతో వచ్చే ఏడాది 3,4 తేదీల్లో విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌కు సంబంధించిన లోగోను కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ ఆవిష్కరించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా పరిశ్రమల శాఖ అధికారులతో కలిసిలోగోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి చాంద్‌బాషా, ఏపీఐఐసీ అధికారి మురళి, ఎల్‌డిఎం సాయినాథ్‌ రెడ్డి పాల్గొన్నారు.