అర్జీలు స్వీకరిస్తున్న అధికారులు
ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్: స్పందన కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరి సమస్యను తక్షణమే పరిష్కరించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ మనూజా, కమిషనర్ ప్రమీల పేర్కొన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వారు వినతిపత్రాలను స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులపై సంబంధిత అధికారులకు వెంటనే పరిష్కార నిమిత్తం ఆదేశాలు జారీ చేసినట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పురపాలక సంఘంలోని అన్ని శాఖాల అధికారులు పాల్గొన్నారు.










