Jan 09,2023 21:52

మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ మహీదర్‌రెడ్డి

ప్రజాశక్తి -కందుకూరు :సమస్యల పరిష్కారం కోసమే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిసు ్తన్నామని ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌ రెడ్డి చెప్పారు. సోమవారం మండలంలోని మహదేవపురం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ఎంఎల్‌ఎ మహీధర్‌ రెడ్డి నిర్వహించారు. సచివాలయ సిబ్బంది సమస్యలు పరిష్కారానికి చొరవ చూపాలని ఆయన కోరారు. ప్రజలు అనేక సమస్యలు దృష్టికి తీసుకువస్తున్నారని ఆ సమస్యలన్నింటినీ పూర్తిస్థా యిలో పరిష్కారం చేసే దిశగా సచివాలయ సిబ్బంది పని చేయాలని సూచించారు. సమస్యలు తమకు పట్టవనే నిర్లక్ష్యంగా వదిలేస్తే తాను చూస్తూ ఊరుకోనని కచ్చితంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో వచ్చిన సమస్యలను 98శాతం పరిష్కరించినట్లు తెలిపారు. మహాదేవపురం తాను తిరిగి మళ్లీ వచ్చేసరికి ప్రజలు చెప్పిన సమస్యలను పరిష్కారం చేసినట్లు తనకు చూపించాలని కోరారు. మహదేవపురం బీసీ కాలనీలో ఇంటింటికి తిరుగుతున్న సందర్భంలో రేషన్‌ కార్డులో తప్పులు, పెన్షన్ల మంజూరు గురించి అడిగారు. సైడ్‌ కాలవలు నిర్మించమని కూడా అడిగారు. తహశీల్దార్‌ డి సీతారా మయ్య ,ఎంపీపీ ఇంటూరి సుశీల ,మహదేవపురం సర్పంచ్‌ కె పద్మ ,ఉప సర్పంచ్‌ నల్లూరి వెంకటేశ్వర్లు ,సర్పంచ్‌లు ఆవుల మాధవరావు, కుమ్మరి బ్రహ్మయ్య,వీర మల్లి శీను, వైసీపీ నాయకులు గంగవరపు బ్రహ్మయ్య ,ఇంటూరి హరిబాబు ,గొల్ల శ్రీనివాసరావు, తొట్టెంపూడి శ్రీనివాసరావు, ఇంటూరి మాధవరావు ,ఎవసంతరావు , పణిదపు రోశయ్య, సూరం వేణుగోపాల రెడ్డి ఉన్నారు.