అభివృద్ధి కార్యక్రమాలకు సంబందించిన కరపత్రాన్ని అందజేస్తున్న ఎమ్మెల్యే
ప్రజాశక్తి - తలుపుల : ప్రజాసమస్యల పరిష్కారమే వైసిపి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే డాక్టర్ పి వి సిద్ధారెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని సచివాలయం 3 బురుజుపల్లి, మాడిక వాండ్లపల్లి, గాంధీ బజార్, కోట గ్రామాలలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు మహిళలు ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ మహమ్మద్ రఫీ నాయక్, నాయకులు కులశేఖర్ రెడ్డి, ఓబులేశ్వరమ్మ, పురుషోత్తం రెడ్డి, రిటైర్డ్ ఉపాధ్యాయులు టోపీ రమణ, మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ డీకే బాబు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










