Nov 07,2023 23:02

ప్రజాశక్తి-సామర్లకోట రూరల్‌ గ్రామాల్లో ఉన్న సమస్యలకు సంబంధించి సత్వరమే చర్యలు తీసుకుంటామని హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, వైసిసిపి పెద్దాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి దవులూరి దొరబాబు అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం మండల పరిధిలోని అందరు పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, సచివాలయ సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఎంపిపి బొబ్బరాడ సత్తిబాబు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి సచివాలయాల పర్యటన సందర్భంగా గుర్తించిన సమస్యల పరిష్కారానికి రూ.20 లక్షల నిధులు మంజూరు ప్రకటించినట్టు చెప్పారు. వాటితో పాటు సిఎం దృష్టికి పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో రైతుల ఇబ్బందులకు సంబంధించి పుంత రోడ్ల నిర్మాణాలు వంటి విషయాలను తీసుకెళ్లినట్టు చెప్పారు. ఎంపిడిఒ డి.శ్రీలలిత, డిఇ భాస్కర రమేష్‌, మండల పరిధిలోని సర్పంచులు, ార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.