వినతిపత్రం అందజేస్తున్న నాయకులు
ప్రజాశక్తి కదిరి అర్బన్ : మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను అధికారులు, పాలకులు వెంటనే పరిష్కరించాలని జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి భైరవప్రసాద్ డిమాండ్ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడతూ మున్సిపాలిటీ పరిధిలో అనేక సమస్యలు తిష్టవేశాయన్నారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి వేదికైన మున్సిపల్ మీట్‌లో ఎలాంటి చర్చ జరగకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రజాసమస్యలపై పాలకులకు, అధికారులకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతోందని ఎద్దేవా చేశారు. 34వ వార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ హరిబాబుకు జనసేన పార్టీ తరపున వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మణ, రాజేంద్ర ప్రసాద్, రవీంద్ర ,రాజేంద్ర ప్రసాద్, కిన్నెర మహేష్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.










