Dec 01,2022 21:18

అమరాపురంలో మహిళతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే తిప్పేస్వామి

         ప్రజాశక్తి-అమరాపురం   సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకే ప్రభుత్వం గడప గడపకూ మన ప్రభుత్వ కార్యక్రమం చేపట్టిందని ఎమ్మెల్యే తిప్పేస్వామి అన్నారు. గురువారం మండల పరిధిలోని మద్దనకుంటలో సర్పంచి గోవిందప్ప అధ్యక్షతన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌ అధికారంలోకి వచ్చాక లబ్ధిదారుల ఇళ్ల వద్దకే సంక్షేమ పథకాలు అందుతున్నామన్నారు. ముఖ్యంగా రేషన్‌ కార్డులు, గృహాలు, రైతు భరోసా, జగనన్న విద్యార్థి వసతి దీవెన, అమ్మఒడి వంటి అనేక పథకాలను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో అధ్యక్షులు బాగాల చిక్కన్న, ఎంపిపి ఈరన్న, జడ్పిటిసి స్వరక్క నరసింహమూర్తి, వైస్‌ ఎంపిపి కృష్ణమూర్తి, ఎంపిటిసి హనుమంతరాయ, నాయకులు టైలర్‌ కెంచప్ప, గడ్డం రాజు, జక్‌ మూర్తి, డీలర్లు తిప్పేస్వామి, శివకుమార్‌, ఉదుగూరు తిప్పేస్వామి, పేలుబండ ప్రసాద్‌, పుల్లికుంట మంజునాథ, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
హిందూపురం : రాజకీయ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందజేస్తున్నట్లు ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ తెలిపారు. గురువారం హిందూపురం పురపాలక సంఘ పరదిలోని 35వ వార్డు మార్కండేయ నగర్‌, వెంకటేష్‌ నగర్‌లో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ, వైస్‌ఛైర్మన్‌లు జబీవుల్లా, బలరామిరెడ్డి, వార్డు కౌన్సిలర్‌ మద్దెన జయప్ప, కౌన్సిలర్లు మారుతీరెడ్డి, అయూబ్‌, ముస్తాక్‌, రోషన్‌ అలీ, మణి, రహమత్‌బి, గిరీష్‌, మల్లికార్జున, నాగేంద్రమ్మ, కో-ఆప్షన్‌ సభ్యులు రహమత్‌, మున్సిపల్‌ అధికారులు, సచివాలయ సిబ్బంది, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పరిగి : గ్రామానికి రహదారి ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేయాలని మండలంలోని బోరెడ్డిపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యే శంకరనారాయణకు విన్నవించారు. గురువారం మండలంలోని మూడిండ్లపల్లి, చిన్నపల్లి, బోరెడ్డిపల్లి గ్రామాల్లో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా 15 ఏళ్లుగా పరిగి నుంచి గోరెడ్డిపల్లికి వచ్చే ప్రధాన రహదారి గుంతలమయంగా మారిందని, టిడిపి హయంలో రహదారికి కంకర వేసి రోడ్డు నిర్మాణం మరిచారని మీరైనా స్పందించి రోడ్డు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్‌ నరసింహమూర్తి, సర్పంచి లక్ష్మీదేవి, నాయకులు శివశంకర్‌, ప్రభాకర్‌, గోవిందప్ప, తదితరులు పాల్గొన్నారు.