Dec 21,2022 19:34

మాట్లాడుతున్న జిల్లా ఉపాధ్యక్షులు టి.హరీంద్రనాథ్‌శర్మ

ప్రజాశక్తి - మదనపల్లె అర్బన్‌: కార్మికుల సమస్యలు పరిష్కరించుకోవాలంటే ఐక్య పోరాటాలే శరణ్యమని, కార్మికులందరూ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరశించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యాక్షులు టి.హరీంద్రనాథ్‌శర్మ, పి.శ్రీనివాసులు తెలిపారు. బుధవారం స్థానిక దేశారు ఫంక్షన్‌ హాలులో సిఐటియు మండల మహాసభ సిఐటియు జిల్లా నాయకులు డి.ఆర్‌.మధురవాణి అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు కనీన వేతనం రూ.26 వేలు ఇవ్వాలని తెలిపారు. స్కీమ్‌ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ ఇవ్వాలని తెలిపారు. ఆటో, బిల్డింగ్‌, హమాలీ వర్కర్లకు ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను తమ హక్కుల కోసం పోరాటాలు చేయకుండా అనిచి వేస్తుందని పేర్కొన్నారు. అదే బాటలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితిల్లో స్కీమ్‌ వర్కర్లకు ఇనున్న జీతాలు ఏమాత్రం చాలడం లేదని వీరందరికీ కనీన వేతనం నెలకు రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆటో రంగంలో పనిచేస్తున్న ఆటో కార్మికులకు పోలీసుల వేదింపులు, జరిమానాలు విధించడం మానుకోవాలని డిమాండ్‌ చేశారు. బిల్డింగ్‌ రంగంలో పనిచేస్తున్న వారందరికీ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పిస్తే ప్రమాదవశాత్తు మరణించిన వారికి దీని ద్వార వారి కుటుంబ పోషణ భారం కాకుండా ఉంటుందని తెలిపారు. అనంతరం మదనపల్లె మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా ఎ.వెంకటేష్‌, కార్యదర్శిగా జి.గంగాదేవిలతో పాటు 11 మంది సభ్యులను ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్షులు డి.ప్రభాకర్‌రెడ్డి, అంగన్వాడీ జిల్లా కార్యదర్శి రాజేశ్వరి, ఆశా యూనియన్‌ అధ్యక్షులు జయమ్మ, బిల్డింగ్‌ యూనియన్‌ నాయకులు వెంకటేష్‌, హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు రమణ రావు, సంఘమిత్ర నాయకులు శ్వేత, అన్ని యూనియన్‌ సభ్యులు పాల్గొన్నారు.