Dec 27,2022 22:31

సమస్యలు వింటున్న ఎమ్మెల్యే

ముదిగుబ్బ : ప్రజాసమస్యల పరిష్కారానికే గుడ్‌మార్నింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చెప్పారు. మండల కేంద్రంలోని వడ్డీపేట కాలనీలో గుడ్‌మార్నింగ్‌ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుని అధికారులతో చర్చించి అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆదినారాయణ యాదవ్‌, ఇందుకూరు నారాయణరెడ్డి, జెడ్పీటీసీ తిరుమల బారు సేవే నాయక్‌, సర్పంచి చిన్న రాయుడు, లక్ష్మీదేవితో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.