Jan 26,2023 21:30

మతపెద్దలకు స్థల పత్రాలు అందజేస్తున్న ఎమ్మెల్యే, జడ్పి చైర్మన్‌

రాజంపేట అర్బన్‌ : 74 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం పురపాలక కార్యాలయంలో ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జడ్పి చైర్మన్‌ ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ పోలా శ్రీనివాసులురెడ్డిలు హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌లకు స్మశాన వాటికలకు సంబంధించిన పత్రాలను ఆయా మతపెద్దలకు అందజేశారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ హిందూ ముస్లిం, క్రైస్తవులకు స్మశానవాటికలను కేటాయిం చాలని ప్రజలు తమ దష్టికి తీసుకురావడంతో ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి సహకారంతో స్మశాన వాటికల విషయమై కలెక్టర్‌, ఆర్‌డిఒలకు అర్జీల ద్వారా తెలియజేశామని అన్నారు. ఇచ్చిన మాటకు అనుగుణంగా స్మశాన వాటికల స్థలాలకు జి కలెక్టర్‌ ప్రొసీడింగ్‌ను పంపించడం జరిగిందని తెలిపారు. హిందూస్మశాన వాటికకు 5 ఎకరాలు, ముస్లిం స్మశాన వాటికకు 4ఎకరాలు, క్రైస్తవ స్మశాన వాటికకు 3ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు. కుల మతాలకతీతంగా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా అందరికీ సమానంగా ఉండాలన్న ఉద్దేశంతో స్మశాన స్థలా లను కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు, హిందూ ముస్లిం, క్రైస్తవమత పెద్దలు, వైసిపి నాయకులు, పాల్గొన్నారు