Jan 30,2023 21:41

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

కొత్తచెరువు : మండల కేంద్రంలోని కుమ్మర కాలనీ బీసీ కాలనీ వడ్డెర కాలనీ కమ్మ పాలెం ప్రాంతాల వారి కోసం శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని మానవ హక్కుల సంఘం నాయకులు పాపన్న కోరారు. ఈ మేరకు ఆయన తహశీల్దార్‌ రామాంజనేయరెడ్డికి, ఎంపీడీవో సిద్ధారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల సంఘం నాయకులు విష్ణు, చింతకాయల కిష్టప్ప, వెంకట్రాముడు, భాస్కర తదితరులు పాల్గొన్నారు.