ప్రజాశక్తి - మైలవరం : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని ఈ ప్రభుత్వాలను సాగనంపాల్సిన అవసరం ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పివి.ఆంజనేయులు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ మైకు ప్రచారంతోపాటు ఇంటింటికి తిరుగుతూ కరపత్ర ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలని 400 రూపాయలకే గ్యాస్ ఇవ్వాలని, నిత్యవసర సరుకు ధరలు తగ్గించాలని గ్రామాల్లో అపరిష్కతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి రావూరి రమేష్ బాబు, మండల నాయకులు సిహెచ్ సుధాకర్, వజ్రాల వెంకటరెడ్డి, సందీ పాము ఇస్సాక్, పి నాగేశ్వరరావు, రావుల సుబ్బారావు, సురేష్, విజరు పాల్గొన్నారు.
చందర్లపాడు : మండల కేంద్రంలో ఇంటింటికి తిరుగుతూ సిపిఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు చనమోలు సైదులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు షేక్ హస్సాన్, సందిపోగు లింగయ్య, నాగేశ్వరరావు,పుల్లయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కంచికచర్ల : సెప్టెంబర్ 4 వరకు సిపిఎం ఆధ్వర్యంలో సమరభేరి కార్యక్రమం పిలుపులో భాగంగా బుధవారం కంచికచర్లలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోట కళ్యాణ్ గోడపత్రిక ఆవిష్కరించారు. స్థానిక రైతుబజార్ రోడ్డు, చెవిటికల్లు రోడ్డుసెంటర్‌లలో ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బెజ్జం భూషణం, సుధాకర్, గణపతి, దుర్గారావు, విమలమ్మ తదితరులు పాల్గొన్నారు.
వన్‌టౌన్ : 51వ డివిజన్ కొండ ప్రాంతంలో సిపిఎం పశ్చిమ సిటీ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగ సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయి సత్యబాబు మాట్లాడారు. 34, 35 డివిజన్ పరిధిలోని కేదారేశ్వరిపేట ప్రాంతాల్లో సిపిఎం పాదయాత్ర నిర్వహించింది. పాదయాత్రలో పార్టీ పశ్చిమ కమిటీ కార్యదర్శి బి.సత్యబాబు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి పి.కోటేశ్వరరావు, సిపిఎం నగర కార్యదర్శి సభ్యులు కే. సూరిబాబు, నగర కమిటీ సభ్యులు ఇవి నారాయణ, నాయకులు ఎస్కే. చిన్నబాబు, సత్యనారాయణ, పాల్గొన్నారు.
నందిగామ : పెంచిన కరెంటు చార్జీలు, నిత్యవసర వస్తువు ధరలు తగ్గించాలని 11వ వార్డులో సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చనుమోలు సైదులు, కె.గోపాల్, సయ్యద్ ఖాసిం ,సయ్యద్ బాజీద్బీ, మండూరు శ్రీ నివాస రావు, గోపి నాయిక్, దామ్షెదర్, పాల్గొన్నారు.
వీరులపాడు : సిపిఎం ఆధ్వర్యంలో సమర భేరి వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కమిటీ సెక్రటేరియట్ సభ్యుడు కోట కళ్యాణ్ మాటాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి చాట్ల.రవి, సిపిఐ నాయకులు వట్టికొండ.చంద్రమోహన్ వాసిరెడ్డి.రాధాకష్ణ సిపిఎం నాయకులు ప్రభాకర్ రావు వట్టికొండ, దితరులు పాల్గొన్నారు
జగ్గయ్యపేట : మండలంలోని షేర్ మహమ్మద్ పేట గ్రామంలో బుధవారం కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంచుతూ, సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కోటా కష్ణ, దంతాల వెంకటేశ్వర్లు పుట్టాం పుల్లారావు, ప్రభు, రామకష్ణ తదితరులు పాల్గొన్నారు.
తిరువూరు : ఈ నెల 25 నుండి సెప్టెంబర్ 4 వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ, అధికధరలు, విద్యుత్ ఛార్జీలు, నిరుద్యోగానికి వ్యతిరేకంగా జరిగే సమరభేరిని జయప్రదం చేయాలని సిపిఎం తిరువూరు పట్టణ కమిటీ నాయకులు ప్రచారాన్ని విస్తతంగా చేపట్టారు. బుధవారం తిరువూరు మెయిన్ రోడ్డు జంట సినిమా హాల్ సెంటర్ వద్ద బిల్డింగ్ కార్మికులకు సమరభేరి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి మేకల నాగేంద్రప్రసాద్, సీనియర్ నాయకులు ఎస్పీ భద్రం, ఆకుల రవి, పంతంగి శ్రీనివా సరావు, బి.వెంకటేశ్వర రావు, కె.వెంకటరత్నం, సప్పిడి సురేష్ కార్మికులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం : కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో 9 వార్డులో ఇంటింటికి తిరుగుతూ సిపిఎం ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కరపత్రాలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సిపియం కొండపల్లి టౌన్ సెక్రటరీ ఎం.మహేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు షేక్ బాషా, ఎల్ పార్వతీ, కె బేబీ సరోజిని , బాబ్జి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










