ప్రజాశక్తి - వన్‌టౌన్
సెప్టెంబరు 26వ తేదీ నుండి నిర్వహించనున్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వారి శవర్నవరాత్రి దసరా మహౌత్సవాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లును అధికారులు సమన్వయంతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు ఆలయ అధికారులకు సూచించారు. సెప్టెంబరు 26వ తేది నుండి అక్టోబరు 5వ తేది వరకు నిర్వహించనున్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి శరాన్నవరాత్రి (దసరా) మహౌత్సవాల నిర్వహణపై ఆదివారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ఆలయ అధికారులతో సమవేశాన్ని నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అమ్మవారి దర్శనానికి రాష్ట్రం నుండే కాకుండా తెలంగాణ, కర్నాటక, తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల నుండి తరలివస్తారన్నారు. ప్రతి రోజు 30 వేల మంది పైగా అమ్మవారి దర్శనాన్ని చేసుకుంటారని మూలా నక్షత్రం రోజు 2 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. గత అనుభావాలను దష్టిలో ఉంచుకుని దసరా ఉత్సవాల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేసేందుకు సంబంధిత శాఖ అధికారుల సూచనలు, సలహాలను తీసుకుని సమన్వయంతో ఏర్పాట్లను చేపట్టాలన్నారు. పోలీస్, రెవెన్యూ ,మున్సిపల్, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, ఇరిగేషన్, మత్స్య, ఆర్ అండ్ బి ,పిడబ్ల్యూడి, సమాచార పౌర, సంబంధాలు తదితర శాఖ అధికారుల సమన్వయంతో ఏర్పాట్లను చేపట్టి ఉత్సవాలను విజయవంతానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వారి దేవస్థానం ఎగ్జిక్యూటర్ ఆఫీసర్ దర్భముళ్ళ భ్రమరాంబ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కె.వి ఎస్ కోటేశ్వరరావు, ఎల్ రమ, ఏఇవో సుధరాణి పాల్గొన్నారు.










