Mar 24,2022 23:46

బైక్‌ ర్యాలీని ప్రారంభిస్తున్న కార్మిక సంఘాల నేతలు

- కార్మిక సంఘాల నేతలు
ప్రజాశక్తి - కర్నూలు కార్పొరేషన్‌:
ఈనెల 28,29 తేదీలలో జరుగు సమ్మె జయప్రదం చేసి ప్రధాన నరేంద్రమోడీకి గుణపాఠం చెప్పాలని కార్మిక సంఘాల నేతలు అన్నారు. ఉద్యోగ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సి క్యాంప్‌ సర్కిల్‌ నుండి రాజవీహార్‌, పెద్ద పార్క్‌, కొండారెడ్డి బురుజు, ఆర్‌ఎస్‌.రోడ్‌, కొత్త బస్టాండ్‌ మీదుగా బళ్లారి చౌరస్తా వరకు స్కూటర్‌ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్బంగా జరిగిన సభలో సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్‌. రాధాకృష్ణ, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి మునెప్ప, ఐఎన్‌టియుసి జిల్లా కార్యదర్శి నాగన్నలు మాట్లడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు నష్టదాయకమైన విధానాలు అవలంబిస్తూ పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చే విధంగా వ్యవహరిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి బుద్దిచెప్పాలంటే సమ్మె ద్వారా సాధ్యమవుతుం అన్నారు. కార్మికులు సార్వత్రిక సమ్మెకు సిద్ధం కావాలని కోరారు. ఇప్పటి వరకు జరిగిన సమ్మెలు కార్మిక చట్టాలలో మార్పులను చేస్తూ కొత్త చట్టాలను అమలు చేయకుండా అడ్డుకట్ట వేశాయని, 28, 29 తేదీలలో జరుగు సార్వత్రిక సమ్మె చారిత్రాత్మ క మైన సమ్మె గా నిలిచిపోవాలని అన్నారు. మోడీ ప్రభుత్వానికి సమ్మె ద్వారా గుణపాఠం చెప్పాలని అన్నారు. ఈ ర్యాలీలో ఎల్‌ఐసి యూనియన్‌ నాయకులు సునీయా కుమార్‌, రమేష్‌, బిఎస్‌ఎన్‌ఎల్‌ యూనియన్‌ నాయకులు రామరాజు, సిఐటియు నగర కార్యదర్శులు అంజిబాబు, విజరు, ఎఐటియుసి నగర నాయకులు రామకృష్ణారెడ్డి, వెంకటేశలు, ఐఎన్‌టియుసి నాయకులు బాబు పాల్గొన్నారు.