Mar 25,2022 21:13

ప్రజాశక్తి-యంత్రాంగం : కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 28, 29 తేదీల్లో జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ రాష్ట్రంలో శుక్రవారం ఉధృత ప్రచారం జరిగింది. సిఐటియు, ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, టిఎన్‌టియుసి ఆధ్వర్యాన బైక్‌ ర్యాలీలు, ప్రచార జాతాలు, రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించారు. ఏ సంఘంలో ఉనాు, లేకునాు ప్రతి కార్మికుడు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని వక్తలు కోరారు. అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విశాఖలోని నేవల్‌ డాక్‌ యార్డు పైపులైన్‌ నుండి ఒక బైక్‌ ర్యాలీ, స్టీల్‌ప్లాంట్‌ నుంచి ఒక బైక్‌ ర్యాలీ బయలుదేరి జింక్‌ గేట్‌ వద్దకు చేరుకున్నాయి. అనంతరం అక్కడ జరిగిన బహిరంగ సభలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఏ ఒక్క ప్రభుత్వ రంగం సంస్థనూ స్థాపించలేదని తెలిపారు. కానీ, ఉను వాటినికార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్‌ కోడ్స్‌ తీసుకొచ్చి కార్మికులను కట్టుబానిసలుగా మారుస్తున్నారని విమర్శించారు. 94 శాతంగా ఉను అసంఘటితరంగ కార్మికులకు ఎటువంటి చట్టపరమైన హక్కులూ లేకపోవడంతో దోపిడీకి గురవుతున్నారని తెలిపారు. సిఐటియు, ఐఎన్‌టియుసి, ఎఐటియుసి, హెచ్‌ఎంఎస్‌, టిఎన్‌టియుసి, వైఎస్‌ఆర్‌టియుసి నాయకులు పాల్గనాురు. నగరంలోనూ, జిల్లాలోనూ ప్రచారాలు, బైక్‌ ర్యాలీలు జరిగాయి. రైల్వే ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో గుంటూరులోని బ్రాడీపేటలోగల గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో రైల్వే కాంట్రాక్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కన్వీనర్‌ వి.ఉమామహేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. రైల్వే ప్రైవేటీకరణ వల్ల ప్రజలపై భారాలు పడతాయన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాడిలాంటి రైల్వేల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రైల్వే కార్మికులంతా సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని కోరారు. విజయనగరం జిల్లాలో సిఐటియు ఆధ్వర్యాన ఈ నెల పదిన ప్రారంభమైన పాదయాత్ర విజయనగరం పట్టణానికి చేరుకుంది. పాదయాత్ర బృందానికి వై-జంక్షన్‌ వద్ద కార్మికులు, స్కీం వర్కర్లు ఘన స్వాగతం పలికారు. దత్తిరాజేరు మండలం కోమటిపల్లిలో ఆటో ప్రచారానిు సిఐటియు సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణమూర్తి జెండా ఊపి ప్రారంభించారు. శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో బైక్‌ ర్యాలీలు, రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, ప్రచార జాతాలు నిర్వహించారు. కరూులులో ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు కార్యకర్తల సమావేశంలోనూ, అనంతరం మీడియాతోనూ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యవసాయ కార్మికులు, గ్రామీణ ప్రజలు ఐక్యంగా తిప్పికొట్టాలనికోరారు. ప్రకాశం జిల్లా మార్టూరులోని పెద్ద కూరగాయల మార్కెట్‌ ఆవరణలోని సివిల్‌ సప్లయి గోడౌన్‌ వద్ద జరిగిన ముఠా కార్మికులు, హమాలీల జనరల్‌బాడీ సమావేశంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు పాల్గని ప్రసంగించారు. కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు పిహెచ్‌సి వైద్యాధికారికి సిఐటియు ఆధ్వర్యాన ఆశా కార్యకర్తలు, కంచికచర్లలో పంచాయతీ కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చారు. సమ్మెపై మధ్యాహు భోజన పథకం కార్మికులు వత్సవాయిలో ప్రచారం చేశారు. సార్వత్రిక సమ్మెపై 'ప్రజాశక్తి' ప్రచురించిన ప్రత్యేక సంచికను తూర్పుగోదావరి జిల్లా చింతూరులో సిఐటియు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. కాకినాడ యుటిఎఫ్‌ హోంలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సదస్సులో జెఎసి చైర్మన్‌ ఎవి.నాగేశ్వరరావు మాట్లాడారు.