Mar 25,2022 23:40

ప్రచారంలో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గౌస్‌దేశాయి

ప్రజాశక్తి - విలేకరులు: సమ్మెను జయప్రదం చేయాలని జిల్లాలోని వివిధ మండల కేంద్రాల్లో ప్రదర్శనలు చేశారు. కరపత్రాలు పంపిణీ చేశారు. సభలు, సమావేశాలు నిర్వహించారు. సిఐటియు, వ్యవసా కార్మిక సంఘం, భవణ నిర్మాణ కార్మికులు, ఆశాలు, అంగన్‌వాడీలు, మధ్యాహ్న భోజన కార్మికులు వేర్వేరుగా ప్రదర్శనలు చేశారు. వెల్దుర్తి మండలంలో సిఐటియు జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయి, కర్నూలు నగరంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
వెల్దుర్తి : ఈనెల 28, 29 తేదీల్లో జరిగే సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు వెల్దుర్తి మండల అధ్యక్షులు రాజు అధ్యక్షతన ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్‌ దేశాయి మాట్లాడారు. దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళ్ల కాలంలో వంద సంవత్సరాల క్రితం నుండి ఉద్యోగులు, కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ కార్మిక చట్టాలలో మార్పు తెచ్చారన్నారు. నాలుగు లేబర్‌ కోడ్సను తెచ్చి కార్పొరేట్‌ కంపెనీల్లో కార్మికులను బానిసలుగా మార్చడానికి పూనుకున్నదన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేటర్‌ చేతుల్లో పెడుతున్నదని, కనీస వేతనాల ప్రస్తావన చేయడం లేదన్నారు. అసంఘటిత కార్మికుల సంక్షేమం ఈ ప్రభుత్వానికి పట్టలేదని, స్కీం వర్కర్లతో వెట్టిచాకిరి చేస్తుందన్నారు. ఈ రకంగా ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బిజెపి పాలన నుండి ప్రజలను కాపాడేందుకు, దేశరక్షణకు మార్చి 28,29 తేదీల్లో జరిగే సార్వత్రిక సమ్మెలో ఉద్యోగులు కార్మికులు ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు నగేష్‌, సిఐటియు మండల కార్యదర్శి రామానాయుడు, గౌరవ అధ్యక్షులు రాముడు, మండల ఉపాధ్యక్షులు మారెన్న హమాలీ యూనియన్‌ నాయకులు పెద్ద ఏసు, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు పాల్గొన్నారు.
 

 ర్యాలీ చేపడుతున్న సిఐటియు ఓల్డ్‌ సిటీ కమిటీ నాయకులు
ర్యాలీ చేపడుతున్న సిఐటియు ఓల్డ్‌ సిటీ కమిటీ నాయకులు