ప్రజాశక్తి- జికేవీధి: ఈనెల 28, 29న దేశ వ్యాప్తంగా సమ్మెను విజయవంతం చేయాలని గిరిజన సంఘం మండల కార్యదర్శి గడూతూరి సత్యనారాయణ, ముర్ల చంటిబాబు కోరారు. ఈ మేరకు సమ్మె కరపత్రాలు పంపిణీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు అదుపు చేయడంలో విఫలం కావడంతో కార్మికులు, పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అన్ని శాఖల కార్మికులు ప్రజలు పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరిచే విధంగా సమ్మె విజయవంతానికి సహకరించాలని కోరారు.
కశింకోట:అఖిల భారత సమ్మెలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కశింకోటలో సిఐటియు, ప్రజా సంఘాలు, ఐద్వా సంయుక్తంగా గురువారం అఖిల భారత సమ్మె గోడ పత్రికను ఆవిష్కరించారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నాయకులు డిమాండ్ చేశారు. అసంఘటిత కార్మికులకు పెన్షన్ విధానం అమలు చేసి సమగ్ర చట్టం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దాకారపు శ్రీనివాసరావు, వివి శ్రీనివాసరావు, డిడి వరలక్ష్మి, శేషు, శాంతి, అప్పారావు, సన్యాసిరావు, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి: దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాలకృష్ణ పిలుపు ఇచ్చారు. ఆచార్య ఎన్.జి.రంగా ప్రాంతీయ పరిశోధన కేంద్రం కాంట్రాక్ట్ వర్కర్స్ సమావేశంలో బాలకృష్ణ మాట్లాడుతూ, కనీస వేతనం రూ.26,000, అసంఘటిత రంగ కార్మికుల కోసం సమగ్ర చట్టాన్ని చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర డిమాండ్ల సాధనకు సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు.
అనంతగిరి: సమ్మెకు ఆశ కార్యకర్తలు సన్నద్ధం కావాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఉమామహేశ్వరరావు పిలుపు ఇచ్చారు. స్థానిక ఆసుపత్రి వద్ద ఆశ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆశ కార్యకర్తలకు కనీస వేతనం రూ.26,000 ఇచ్చి, కోవిడ్‌తో మృతి చెందిన ఆశా కార్యకర్తలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. జెడ్పిటీసి డి.గంగరాజు మాట్లాడుతూ, కార్మికులతో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయిస్తోందని తెలిపారు.
పరవాడ:సమ్మెను జయప్రదం చేయాలని ఫార్మాసిటీలో సిఐటియు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ, ఫార్మాసిటీలో భద్రతా ప్రమాణాలు అమలు చేయాలని కార్మికులకు రక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారున. ఈ బైక్ ర్యాలీ ఐఓసీ నుండి ఫార్మాసిటీలో అన్ని రోడ్లు గుండా సాగింది. రాంకీ ఎస్‌ఈజెడ్ వరకు సాగింది. అనంతరం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె.ఎంకి నాయుడు, చిన్నారావు, కె.అప్పలరాజు, రమణ, సత్తిబాబు, రాజు, పెంటారావు, నాగ అప్పారావు, అప్పలనాయుడు, శేషు తదితరులు పాల్గొన్నారు
పిఎం పాలెం:28,29 రెండు రోజులు ఆటో రిక్షా కార్మిక సంఘాలు పిలుపుతో ఆటో బందు నిర్వహిస్తున్నట్లు విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం అధ్యక్షుడు రాజు కుమార్ తెలిపారు. ఆటో జాతాను గురువారం కార్ సెడ్ కూడలి వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని, బందు జయప్రదం చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జోన్ అధ్యక్షులు డి అప్పలరాజు, సంఘం నాయకులు టీ.రమేష్, జి.చిన్నారావు, అప్పారావు, అబ్బాస్, కే.రాము, కష్ణ, అంజి, శంకర్‌రావు, జి.ఈశ్వరరావు, పి శ్రీను పాల్గొన్నారు.
తగరపువలస: ఈ నెల 28,29 తేదీల్లో జరుప
తలపెట్టిన సమ్మెకు సంబందించి పోస్టర్‌ను గురువారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఆర్‌ఎస్‌ఎన్ మూర్తి, రవ్వ నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.
పాడేరు: ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయని సిఐటియు అధ్యక్షులు ఆర్.శంకరరావు విమర్శించారు. పాడేరులో ఆటో కార్మికులతో సమావేశమై మాట్లాడారు. ఈనెల 28, 29 జరిగే రెండు రోజుల సమ్మెలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో బుజ్జి, సంజీవ్, లింగమూర్తి, జగన్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.
కశింకోట:కశింకోట వారపు సంతలో సిఐటియు ప్రజా సంఘాలు, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) సంయుక్తంగా సమ్మె కరపత్రాలు పంపిణీ చేశారు.ఈ సమ్మెకు అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దాకారపు శ్రీనివాసరావు, డిడి వరలక్ష్మి, ఆర్.అమ్మాజీ ,గోవింద్ కుమార్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
కొయ్యూరు : సమ్మె విజయవంతం చేయాలని. అంగన్వాడీలు, ఆశ ఆధ్వర్యంలో ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకురాలు ముత్యాలమ్మ, పూర్ణ, సిఐటియు నాయకులు అప్పలనాయుడు, గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.
కోటవురట్ల : కోటవురట్లలోని సిఐటియు కార్యాలయంలో పోస్టర్‌ను ఆవిస్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు అప్పలరాజు, నాయకులు డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు.
నాతవరం : నాతవరం మండల కేంద్రంలో గిరిజన సంఘం ఆధ్వర్యాన సమ్మె జయప్రదానికి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కన్వీనర్ పల్లి భాస్కరరావు, నాయుకులు కె. నాగరాజు, చిన్ని, రాజు తదితర్లు పాల్గొన్నారు.
ఎంవిపి కాలనీ : సార్వత్రిక సమ్మెకు అఖిలభారత గిరిజన ఉద్యోగుల సంఘం విశాఖ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేసింది. 28న విశాఖ బంద్‌కు కూడా మద్దతు తెలియజేస్తున్నామని అఖిలభారత గిరిజన ఉద్యోగుల సంఘం విశాఖ జిల్లా కమిటీ అధ్యక్షులు కోరాబు సత్యనారాయణ, కార్యదర్శికటారి శోభన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
సమ్మె, విశాఖ బంద్‌లో కార్మికవర్గం యావత్తు పాల్గొనాలని సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్ పిలుపునిచ్చారు. మద్దిలపాలెంలోని సిఐటియు కార్యాలయంలో ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికులు, ఆశా కార్యకర్తల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం మద్దిలపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్ వరకూ ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మద్దిలపాలెం జోన్ అధ్యక్ష కార్యదర్సులు వి.కృష్ణారావు, పి.వెంకటరావు, పి.మణి, ఆశా యూనియన్ నాయకులు సీతారత్నం, దేవి హాస్పిటల్స్ యూనియన్ నాయకులు పోతురాజు, కనకరాజు, లక్ష్మి పాల్గొనారు.
గొలుగొండ : ఈ నెల 28న విశాఖ బంద్‌ను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు కోరారు. గురువారం గొలుగొండలో జరిగిన సమావేశంలో రాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎపి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షలు సాపిరెడ్డి నారాయణముర్తి సిఐటియు మండల కార్యదర్శి మంగతాయారు, అంగన్‌వాడి నాయకులు సిహెచ్. బ్రమరాంబ, చిట్టిబాబు, బుల్లబ్బాయి, ఎం.అప్పారావు, అర్జున్, లోవరాజు తదిరులు పాల్గొన్నారు.
పెందుర్తి : సమ్మెను విజయవంతం చేయాలని ఆశ కార్యకర్తలు పిలుపునిచ్చారు. పెందుర్తిలో సమావేశమై సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ పద్మ, సిపిఎం జోన్ కార్యదర్శి బి.రమణి, ఆశా కార్యకర్తలు మేరి, అన్నపూర్ణ, వరలక్ష్మి, అరుణ పాల్గొన్నారు
ఉక్కునగరం : 78వ వార్డు సిపిఎం నాయకులు ఉక్కు నగరం సిఐటియు కార్యాలయంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో వివి.రమణ, బి. అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
జి.మాడుగుల:మండల కేంద్రంలో పోస్టర్ల ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఐకేపీ యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం, సీఐటీయూ మండల అధ్యక్షుడు వి.మహేష్ మాట్లాడుతూ; గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరల ఇంతలా పెరగడం చరిత్రలో ఏనాడు చూడలేదన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నేతలు చరణ్, ఆర్య,న ాగమణి, రాణి, అప్పలమ్మ, లక్ష్మన్ పాల్గొన్నారు.










