Mar 26,2022 16:03

ప్రజాశక్తి-ఆనందపురం : ఈ నెల 28, 29న జరిగే దేశ వ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో విశాఖ జిల్లా ఆనందపురం జంక్షన్ లో బైక్ ర్యాలీ నిర్వహించారు. తగరపువలస నుండి వచ్చిన బైక్ ర్యాలీ ఆనందపురం కూడలిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. అనంతరం ఆనందపురం పూల మార్కెట్ నుండి బోని రోడ్డులో బైక్ ర్యాలీ నిర్వహించి, ప్లే కార్డులు నినాదాలతో బైక్ ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు డివిజన్  నాయకులు ఆర్ యస్ యస్ మూర్తి ,రవ్వ.నర్సింగ్ రావు, ఐద్వా జిల్లా నాయకులు కే.నాగరాణి, అషా యూనియన్ నాయకులు సరస్వతి, ముఠా వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.