Mar 21,2022 22:16

ఫొటో : మాట్లాడుతున్న సిఐటియు నాయకులు పి. పెంచలయ్య

ఫొటో : మాట్లాడుతున్న సిఐటియు నాయకులు పి. పెంచలయ్య
సమ్మెను జయప్రదం చేయాలి
- ప్రచారజాతా ప్రారంభోత్సవంలో కార్మికసంఘాల నాయకులు
ప్రజాశక్తి-కావలి : దేశవ్యాప్తంగా 28, 29వ తేదీల్లో జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కావలి ఉదయగిరి రోడ్డు సెంటర్లో'' జిల్లా జీపు ప్రచార జాతా''ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు, ఎఐటియుసి జిల్లా కార్యదర్శులు కటారి అజరుకుమార్‌, దామా అంకయ్య మాట్లాడారు. దేశంలో బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను సవరిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేస్తూ అంబానీ, ఆదాని లాంటి బడా కార్పొరేటర్ల పాలన సాగుతుందన్నారు. ఈ కార్మిక, ఉద్యోగులకు భద్రత లేదని, ఈ రోజుల్లో అధిక ధరలతో ప్రజలు అల్లాడుతున్నారన్నారు. ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నారన్నారు.
అవుట్‌సోర్సింగ్‌ కార్మికుల పర్మినెంట్‌, కనీస వేతనం అమలు, అధిక ధరలు తగ్గింపు, వంటి కార్మిక సమస్యల పరిష్కారం కోసం 28, 29 తేదీలలో జరుగు ''సార్వత్రిక సమ్మె''లో కార్మికులు ఉద్యోగులు అన్ని రంగాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి పెంచలయ్య, ఎస్‌కె రెహనా బేగం, ఎఎఫ్‌టియు నాయకులు ఎల్‌ లక్ష్మిరెడ్డి, ఎఐటియుసి నాయకులు ఎం.అంకయ్య, ఆశావర్కర్లు వసుంధర, గాయత్రి, ఆదిలక్ష్మి, మున్సిపల్‌ వర్కర్స్‌ మాలకొండయ్య, ఆనందరావులతోపాటు పెద్దసంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.