Mar 21,2022 20:05

మాట్లాడుతున్న యాదగిరి

ప్రజాశక్తి - కోట : ప్రజల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నెల్లూరు యాదగిరి, కోస్టల్‌ కారిడార్‌ కార్యదర్శి మోహన్‌ రావు డిమాండ్‌ చేశారు. ఈనెల 28, 29 తేదీల్లో జరిగే దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సోమవారం మండలంలోని కొత్తపట్నం, గోవిందపల్లి పాలెం, సిద్దవరం, కోట, విద్యానగర్‌, చిట్టేడు, కేశవరం, వాకాడు ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు యాదగిరి, ఎం మోహన్‌రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జరిగే సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. వ్యవసాయం, విద్య ఆరోగ్య ఇతర ప్రజా రంగాల్లో ప్రభుత్వ కేటాయి ంపులు పెరగాలన్నారు. అంగన్‌వాడీ, ఆశా,మధ్యాహ్న భోజనం, వెలుగు,ఉపాధిహామీ, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ సమగ్ర శిక్షణ ఇతర స్కీం వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలన్నారు. ఎఐఎఫ్‌ టియు వివి.రమణయ్య, సిపిఐ కార్యదర్శి కాలేషా, ఎంబేటి చంద్రయ్య, సిఐటియు మండల కార్యదర్శి పి.వి. కష్ణయ్య, కె రమణయ్య, హుస్సేన్‌ బాబు, రైతు కూలి సంఘం నాయకులు రవీంద్ర, అంగన్వాడీ టీచర్లు పద్మ లీలమ్మ,వి.ఆర్‌.ఏ లు పసన్న కుమార్‌, కస్తూరయ్య, సిఐటియు నాయకులు బి.వి.రమణయ్య, రంగయ్య, కోట,వాకాడు అంగన్‌వాడీ వర్కర్లు, మిడ్డే మీల్స్‌ కార్మికులు, భవన నిర్మాణ సంఘం నాయకులు పాల్గొన్నారు.