ప్రజాశక్తి - గూడూరు : సమ్మె జయప్రదం కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార జాతా మనుబోలులో ప్రారంభమైంది. సిఐటియు పారిశ్రామిక కారిడార్ కమిటీ కార్యదర్శి ఎం మోహన్‌రావు పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలను నిరసిస్తూ జరిగే దేశ వ్యాప్తంగా ఈనెల 28,29 తేదీల్లో జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో పారిశ్రామిక కారిడార్ కమిటీ అధ్యక్షులు నెల్లూరు యాదగిరి, సిఐటియు నాయకులు సాగర్, ఎఐటియుసి నాయకులు రమణయ్య, ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి సురేష్, నాయకులు కటికాల వెంకటేశ్వర్లు, దానం, భాస్కర్, ఆదిశేషయ్య పాల్గొన్నారు.
వెంకటాచలం : సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ వెంకటాచలంలో ప్రచార జాత జరిగింది సిఐటియు నాయకులు ఓడూరు వెంకట కష్ణయ్య ముంగర చెంచురామయ్య సి ఐ టి యు జిల్లా ఆఫీస్ ఇంచార్జి శేషగిరిరావు పాల్గొన్నారు.










