ఫొటో : మాట్లాడుతున్న పసుపులేటి పెంచలయ్య
సమ్మె జయప్రదానికి పిలుపు
ప్రజాశక్తి - కావలి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజాకార్మిక ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేకంగా కనీస వేతనాలు అమలు, కార్మికుల పర్మినెంట్ అమలు కోసం 28,29 తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మెకు పది కార్మిక సంఘాలు పిలుపునిచ్చారని తెలిపారు. సిఐటియు అనుబంధ మున్సిపల్ కార్మికుల జనరల్ బాడీ సమావేశం శుక్రవారం స్థానిక కసాయి వీధిలోని సిఐటియు ఆఫీసులో ఎస్ ఆనంద్.రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐటియు పట్టణ గౌరవ అధ్యక్షుడు పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ అంతేకాకుండా మున్సిపల్ కార్మికులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఆప్కాస్ విధానాన్ని తీసుకొచ్చి, నలుగురి పనిని ఇద్దరు చేత చేయించాలని మున్సిపల్ అధికారులు చూస్తున్నారన్నారు. కార్మికులపై పనిభారం పెంచి, కార్మికులను రకరకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. కార్మికులకు ఇవ్వవలసిన కొబ్బరి నూనె, సబ్బులు, యూనిఫామ్, ఇతర వస్తువులను కార్మికులు అడుగుతున్న రెండు సంవత్సరాలుగా ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు కాలయాపన చేస్తున్నారన్నారు. కార్మికులకు ఉన్న సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్షులు యేండ్లూరి రవి, పి.పెంచల నరసింహం, యూనియన్ నాయకులు మాలకొండయ్య, పోలయ్య, జేమ్స్, సీనయ్య, మహిళా కార్మికులు రాజ్యలక్ష్మి, చిన్నమ్మ, అనురాధ, కార్మికులు పాల్గొన్నారు.










