Feb 20,2023 21:10

నినాదాలు చేస్తున్న దృశ్యం

నినాదాలు చేస్తున్న దృశ్యం
సమాన పనికి సమానవేతనం అందజేయాలి
నెల్లూరు:రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనంగా రూ.24 వేలు అందజేయాలని సిఐటియు రూరల్‌ కమిటీ డిమాండ్‌ చేసింది. వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో, పరిశోధన కేంద్రాల్లో రోజువారి కూలీలుగా పనిచేస్తున్న వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా సోమవారం రూరల్‌ నియోజకవర్గ పరిధిలోని ఆకుతోట ప్రాంతంలోని ఆచార్య ఎన్‌.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ పరిశోధన స్థానం కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు రూరల్‌ అధ్యక్ష కార్యదర్శులు కొండా ప్రసాద్‌ ,కిన్నెర కుమార్‌లు మాట్లాడుతూ ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పరిశోధ
న స్థానం నందు వ్యవసాయ కార్మికులుగా గత 20 సంవత్సరాలుగా 52 మంది కార్మికులు రోజువారి కూలీలుగా పని చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తూ పర్మినెంట్‌ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసినారు. ఈ కూలీలందరికీ ఏడాది కాలం పనికల్పించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివారం , పండుగ సెలవులకు హాజరు మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వం ఈ కూలీల సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు నరమాల సతీష్‌ , సిఐటియు రూరల్‌ నాయకులు కట్ట సతీష్‌ , వ్యవసాయ కార్మికుల నాయకులు వి. శ్రీదేవి, ఎన్‌. రమ్య, ఆర్‌. సుబ్బమ్మ, ఆర్‌. రాజేశ్వరి, సిహెచ్‌ శాంతమ్మ వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.