Jun 14,2023 21:27

అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇస్తున్న ఉద్యోగులు

ఎపిజిఇఎ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి
రాయచోటి : కాంటాక్ట్స్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగస్తులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఎపిజిఇఎ జిల్లా అధ్యక్షులు ఎరపరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని మాసాపేట బ్రిడ్జి వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి ఉద్యోగస్తుల సమస్యలపైన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎపిజిఇఎ ఆధ్వర్యంలో సమస్యలు పరిస్కారం కోసం ఈ నెల 22 నుండి చేపట్టిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యో గుల సంఘం ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛన్‌దార్లు, సిపిఎస్‌, కాంట్రాక్టు, కంటిం జెంటు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల దీర్భకాలిక, ప్రస్తుత సమస్యల పరిస్కారానికి, హక్కుల సాధనకు అలుపెరుగని పోరాటం చేస్తున్నమన్నారు. ఎపిజిఇఎ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు సూర్యనారాయణ, ఆస్కారరావు ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ ఇచ్చిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా వినతి పత్రం ఇవ్వడం జరిగింద న్నారు. రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులు పరిరక్షింప బడాలని, సిపిఎస్‌ను రద్దుచేసి ఓపిఎస్‌ ఇవ్వాలిన్నారు. ప్రతి నేల1వ తేదీనే జీతాలు,పింఛన్లు ఇవ్వాలిని డిమాండ్‌ చేశారు. 2019 వరకు నియమితులైన కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలని, కంటింజెంటు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవాలన్నారు. డిఎలు ఎప్పటికప్పుడు విడుదల చేయాలని, పిఆర్‌సి కమిషన్‌తో సంబంధం లేకుండా 11వ పిఆర్‌ సివిధముగానే అధికారుల కమిటీ వేసి 12వపి ఆర్‌సిని ప్రకటించాలిని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, రాయచోటి తాలూకా అధ్యక్షులు ఓసాయి కుమార్‌, కార్యదర్శి సుజిత్‌,ఉపాధ్యక్షులు శ్రీనివాసులు నాయక్‌, వెంకట రమణ, సంయుక్త కార్యదర్శి వలి, శివ రాజశేఖర్‌, సదాశివరెడ్డి తాలుకా అధ్యక్షులు సిద్ది రామయ్య, ట్రెజరర్‌ సాదక్‌, సభ్యుడు యోగాంజులరెడ్డి పాల్గొన్నారు.