మాట్లాడుతున్న పిఎన్‌ఎం జిల్లా కార్యదర్శి శేషయ్య
సమాజాన్ని చైతన్య పరిచేది కళాకారులే
బుచ్చిరెడ్డిపాళెం:సమాజాన్ని చైతన్య పరిచేది కళాకారులేనని ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి గండవరపు శేషయ్య తెలిపారు. బుధవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆయన పిఎన్‌ఎం మండల సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అనేకమంది కళాకారులు ప్రజలను చైతన్య పరుస్తూ అనేక సమస్యలను ప్రభుత్వాలు దష్టికి తీసుకొస్తూ అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. జిల్లాలో అక్షరాస్యత ,సారా, నీరు-మీరు, ఉద్యమాల ద్వారా ప్రజల చైతన్య పరిచి జిల్లాలోని రాష్ట్రస్థాయి గుర్తింపు తీసుకొచ్చారన్నారు. అందుకు అనేక మంది కవులు, రచయితలు ఉన్నం బసవయ్య, కట్టా గోపాల్ రెడ్డి అనేకమంది పేద కళాకారులు సేవలు అందించారన్నారు. వారి వారసులుగా జిల్లాలోని అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించాల్సిన బాధ్యతమనపై ఉందన్నారు.కళాకారులకు రావాల్సిన గుర్తింపుకార్డులు, పెన్షన్లు, ఇళ్ల నిర్మాణం, నివాసి స్థలాలు వారికి ప్రభుత్వం ద్వారా ఇవ్వలేదన్నారు. ఇతర రాయితీలు సాధించుటకు ప్రభుత్వం దష్టి కి తీసుకుపోవాలని, కళాకారులందరిపై ఉందని కోరారు. కార్యక్రమలోజిల్లాకమిటీ నాయకులు చలంచర్ల వెంకట రత్నయ్య, జాలది కన్నయ్య, ఆనంద్ కుమార్, విజయమ్మ, రమణమ్మ, మునుస్వామి, ఏడుకొండలు, వెంకటకష్ణ, నారాయణ, రమణయ్య పాల్గొన్నారు.










