May 28,2023 22:13

విదేశీ పర్యటనకు వెళ్తున్న వారిని సన్మాస్తున్న మానవతా సభ్యులు

 రాయచోటి : సమాజ సేవ లక్ష్యంగా మానవతా స్వచ్ఛంద సంస్థ సేవలు పనిచేస్తున్నామని జిల్లా టూరిజం అధికారి నాగభూషణం , మట్లి సర్పంచ్‌ సోమారపు నాగార్జునాచారి పేర్కొన్నారు. ఆదివారం ప్రతిభా జూనియర్‌ కళాశాలలో జిల్లా మానవతా శాఖ చైర్మన్‌ అరమాటి శివగంగ రెడ్డి ఆధ్వర్యంలో మానవతా స్వచ్ఛంద సంస్థ నెల వారి సమావేశం నిర్వహించారు. అనంతరం విదేశీ పర్యటనకు వెళుతున్న మానవత మాజీ సెక్రటరీ సుదర్శన్‌ రెడ్డి మానవత సభ్యులు ఘనంగా సత్కరించారు. రాయచోటి మానవత శాఖ 2023-24 నూతన అధ్యక్షులుగా చింతం రెడ్డి వెంకట్రామిరెడ్డి (బాబు)ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నాగభూషణం, నాగార్జునాచారాని మానవత కుటుంబ సభ్యులు శాలువాతో సన్మానించి మానవత మెమోంటోను అందజేశారు సంబేపల్లి మండలం దుద్యాల గ్రామం మోపురం పల్లెకు చెందిన దొరబాబు అనే అన్నదాతకు జిల్లా డైరెక్టర్‌ ఆనంద రెడ్డి, మరో రైతుకు గౌరవ సలహాదారుడు బెల్లం లోకనాధ రెడ్డి ఆర్థిక సహాయంతో రూ.5,116 నగదు ప్రోత్సాహకంతో పాటు శాలువాతో సన్మానించి మెమోంటోను అందజేశారు. కార్యక్రమంలో మానవత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.