May 25,2023 21:17

బాధితులు సెల్‌ఫొన్‌ అందిస్తున్న ఎస్‌పి అన్బురాజన్‌

కడప అర్బన్‌ : జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన మిస్సింగ్‌ మొబైల్‌ ట్రాకింగ్‌ సిస్టం ద్వారా పోగొట్టుకున్న సెల్‌ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు ఎస్‌పి అన్బురాజన్‌ తెలిపారు. గురువారం పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాలులో బాధితులకు సెల్‌ఫొన్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి తక్కువ కాలంలో రూ.1.75 కోట్ల విలువైన 669 మొబైల్‌ ఫోన్లు సైబర్‌ క్రైమ్‌ టెక్నికల్‌ విభాగం రికవరీ చేసిందని పేర్కొన్నారు. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండా, ఎఫ్‌ఐఆర్‌ నమోదు లేకుండా ఫోన్లు పోగొట్టుకున్న వారికీ తిరిగి అందజేయాలని సంకల్పంతో గత ఏడాది డిసెంబర్‌ ఒకటిన ప్రారంభించామని చెప్పారు. ఉచిత వెబ్‌ సైట్‌ సేవలు అందిస్తున్నామని తెలిపారు. ప్రజలకు మరింత సులువైన సేవలు అందించడానికి చాట్‌బాక్స్‌ ద్వారా 9392941541 సేవలు ప్రారంభించామని పేర్కొన్నారు.