Sep 24,2023 21:53

ఫొటో : మాట్లాడుతున్న శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్‌ వైద్యశాల ఎమ్‌డి డాక్టర్‌ జె.ప్రణీత్‌

స్కూటర్‌ మెకానిక్స్‌ నూతన కార్యవర్గం ఏర్పాటు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ఆత్మకూరు నియోజకవర్గం స్థాయి స్కూటర్‌ మెకానిక్స్‌ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పట్టణంలోని త్రికోటేశ్వర కళ్యాణ మండపంలో ఆదివారం ఆత్మకూరు నియోజకవర్గ స్కూటర్‌ మెకానిక్‌ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్‌ వైద్యశాల ఎమ్‌డి డాక్టర్‌ జె.ప్రణీత్‌, సిఐ జి.వేణు, ఆత్మకూరు మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.రాములు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి ఆత్మకూరు పట్టణంలోని హీరో హోండా, బజాజ్‌, టివిఎస్‌ షో రూమ్‌ల యాజమాన్యం పలు ఆటో ఫైనాన్స్‌ నిర్వాహకులు కార్యవర్గ సభ్యులు స్కూటర్‌ మెకానిక్‌లు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముందు ఆత్మకూరు ఆర్‌టిసి డిపో నుండి కార్యక్రమం నిర్వహించనున్న త్రికోటేశ్వర కళ్యాణ మండపం వరకు స్కూటర్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వీరితోపాటు మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.రాములు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభించిన అనంతరం అతిధులను ఆహ్వానిస్తూ వారిని సన్మానించారు. ఈ సందర్భంగా మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాములు మాట్లాడుతూ పట్టణంలో టూ వీలర్స్‌ అసోసియేషన్‌ సభ్యుల కార్యవర్గం ఏర్పాటు కావడం సంతోషకరమని, ఈ కార్యవర్గానికి తమవంతు పూర్తి సహకారం అందిస్తామని తెలియపరిచారు. డాక్టర్‌ ప్రణీత్‌ మాట్లాడుతూ మెకానిక్‌ సభ్యులందరూ ఒక కమిటీగా ఏర్పడడం సంతోషకరమని ఈ కార్యవర్గ సభ్యులకు ఏవైనా ప్రమాదం సంభవించిన సమయంలో తన నుండి పూర్తి సహకారం అలాగే రాయితీ వైద్యం అందిస్తామని తెలిపారు. అనంతరం జిల్లా కార్యవర్గ అధ్యక్ష కార్యదర్శులు కాంతయ్య, అన్వర్‌ భాషా, ఆత్మకూరు కార్యవర్గ అధ్యక్ష కార్యదర్శులు మతిన్‌, హసీన్‌లు మాట్లాడారు. ఆత్మకూరు నియోజకవర్గం స్కూటర్‌ మెకానిక్స్‌ నూతన కార్యవర్గంలో 75 మంది సభ్యులు సభ్యత్వం తీసుకున్నారు. వీరందరికీ అతిథులతో ఐడి కార్డులను అందించారు. అలాగే నూతన కార్యవర్గ సభ్యులందరికీ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.